twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అ ఆ' కథ కాపీ మ్యాటర్ : ఈ రోజు త్రివిక్రమ్ నోరు విప్పుతారా ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొన్న గురువారం రిలీజైన త్రివిక్రమ్ తాజా చిత్రం 'అ ఆ' కి టాక్ ఎలా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నారు. దానితో పాటు ఈ చిత్రం కథని యుద్దనపూడి సులోచనరాణి రాసిన మీనా నవలని కాపీ కొట్టి తీసారంటూ విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

    కథ రైట్స్ త్రివిక్రమ్ ...తీసుకున్నారో లేదో అనేది ఎవరికీ తెలియకపోయినా, సినిమాలో ఎక్కడా క్రెడిట్ ఇవ్వకపోవటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే రెండు రోజులుగా జోరుగా ఈ విషయమై వాదోపవాదలు ఫేస్ బుక్, ట్విట్టర్ లో జరుగుతున్నా, ఫిల్మ్ సర్కిల్స్ లో అందరికి తెలిసినా 'అ ఆ' టీమ్ మాత్రం ఈ విషయమై ఎక్కడా మాట్లాడటం లేదు.

    అయితే ఈ రోజు అఆ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జరపబోతున్నారు.ఈ వేడుకలో ఈ విషయం ప్రస్దావనకు వచ్చే అవకాసం ఉందంటున్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ కు త్రివిక్రమ్ వస్తారా..వస్తే మీనా విషయమై క్లారిటీ ఇస్తారా అనేది ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో ఆసక్తికరమైన విషయంగా మారాయి.

    will Trivikram respond to A..Aa Copy ?

    1973 ప్రాంతాలలో విడుదల అయిన సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల నటించిన 'మీనా' పెద్ద హిట్ . అలాగే ఆనాటి ప్రముఖ నవలా రచయిత్రి యుద్దానపూడి సులోచనా రాణి రాసిన 'మీనా' నవల కూడా అప్పట్లో ఒక సంచలనం. అదే నవలను విజయ నిర్మల తన సొంత బ్యానర్ పై రైట్స్ తీసుకుని, తన దర్శకత్వంలో నిర్మించారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్.

    అయితే ఈ అ..ఆ చిత్రం మూల కధలో మీనా పోలికలు కనిపించినా ఆ కధకు త్రివిక్రమ్ ఇచ్చిన ట్రీట్ మెంట్ మరియు స్క్రీన్ ప్లే కొత్తగా ఉండటంతో 'మీనా' సినిమాను మళ్ళీ చూస్తున్నట్లు అనిపించినా త్రివిక్రమ్ మాజిక్ లో ఆవిషయాలు పట్టించుకోము అని కొందరనేవాళ్లు లేకపోలేదు.

    English summary
    writer director Trivikram seems to have tweaked story of Meena a bit, and it's conspicuous that he got heavily inspired from the old film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X