twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో...రిలీజ్ కోసం వైవియస్ చౌదరి అమ్మేసాడా?

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా తియ్యటం ఒక ఎత్తు. దాన్ని రిలీజ్ చేయటం మరో ఎత్తు. గతంలో ఎన్ని హిట్స్ ఉన్నా మనం ప్రస్తుతం తీసిన సినిమాకు బిజినెస్ చెయ్యలేకపోతే దాన్ని విడుదల చేయటానికి నానా తిప్పలూ పడాల్సిందే. తాజాగా అలాంటి సమస్యలనే దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఆయన తాజా చిత్రం‘రేయ్ 'చాలా కాలం అయ్యింది ప్రారంభించి, పూర్తి చేసి. అయితే ఫైనాన్సియల్ సమస్యలతో రిలీజ్ ఆగిపోయింది.

    అయితే ఆ ఆర్ధిక సమస్యలను అథిగమించటానికి తనకు గుడివాడలో ఉన్న బొమ్మరిల్లు థియోటర్ ని అమ్మారని ఫిల్మ్ సర్కిల్ లో వినపడుతోంది. దాదాపు 10 కోట్లకు దాన్ని విక్రయించినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం విడుదలకు ఉన్న సమస్యలు తీరుతాయని చెప్తున్నారు. త్వరలోనే చిత్రం విడుదల అఫీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ థరలు ఆంధ్రాలో పెరిగిన ఈ సమయంలో ముఖ్యంగా విజయవాడకు దగ్గర లోని గుడివాడలో అమ్మకుండా వేరే ఆల్టర్టనేటివ్ చూస్తే బాగుండేదని ఆయన శ్రేయాభిలాషులు అంటున్నారు.

    YVS.Chowdhary sold his theatre for Rey release

    సినిమా విషయానికి వస్తే... వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.

    ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

    చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

    English summary
    Buzz is YVS.Chowdhary sold his owned Bommarillu theatre in Gudivada for Rs 10crs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X