»   » దెయ్యం పాత్రలో నటించాలని కోరిక: క్రిస్టినా స్టివార్ట్

దెయ్యం పాత్రలో నటించాలని కోరిక: క్రిస్టినా స్టివార్ట్

Posted by:
Subscribe to Filmibeat Telugu
లండన్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టినా స్టివార్ట్ 'దెయ్యం' పోషించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను తాను నటించి విడుదలకు సిద్దమైన 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' ప్రీమియర్ షోలో మీడియాకు తెలిపింది. ప్రస్తుతం తాను హీరోయిన్‌గా నటిస్తున్న "ఈడెన్ ఈస్ట్" అనే సినిమాలో 'ఉన్మాది కాతీ అమెస్' అనే పాత్రను నటించడంలో ప్రేమ లేదని ప్రకటించింది.

1951లో విలియమ్ స్టైరాన్ రచించిన పుస్తకం ఆధారంగా తీస్తున్న 'లై డౌన్ ఇన్ డార్క్ నెస్' అనే సినిమాలో ఓ అధ్బుతమైన పాత్రని పోషిస్తున్నారు. వర్జీనియాలో అప్రయోజనాత్మక కుటుంబంతో నివసించే అమ్మాయి అనుకోకుండా ఆత్మహత్య చేసుకునే పాత్రలో క్రిస్టినా స్టివార్ట్ నటన అధ్బుతమంటూ కొనియాడుతున్నారు.

క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ నేను బహుశా నా జీవితంలో పోషిస్తున్న అధ్బుత పాత్రంటూ కొనియాడారు. ఆత్మహత్య చేసుకునే అమ్మాయి పాత్రలో ఫెర్పామెన్స్ తప్పకుండా అభిమానులకు నచ్చుతుందని అన్నారు.క్రిస్టినా స్టివార్ట్ హీరోయిన్‌గా 'ద ట్విలైట్ సాగా: బ్రేకింగ్ డాన్ - పార్ట్ 2' చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో నటించిన ట్విలైట్ సిరిస్‌లలో క్రిస్టినా స్టివార్ట్ రక్త పిశాచి బెల్లా స్వాన్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో కూడా క్రిస్టినా స్టివార్ట్ బెల్లా స్వాన్ పాత్రను పోషిస్తున్నారు.

ఐతే ఓ సీన్‌లో భాగంగా క్రిస్టినా స్టివార్ట్ వేటకు వెళ్తుంది. వేటలో అనుకోకుండా క్రిస్టినా స్టివార్ట్ ఈ చిత్రం షూటింగ్‌లో గాయపడిందని యూనిట్ సభ్యులు పేర్కోన్నారు. ఈ సందర్బంలో క్రిస్టినా స్టివార్ట్ మాట్లాడుతూ మొదటి సీన్ వేటకు సంబంధించిన సీన్ ఎంతో ముఖ్యమైంది. ఆ సీన్‌ బాగా రావాలనే ఉద్దేశ్యంతో యూనిట్ సభ్యులందరూ ఎక్కువ కష్టపడ్డాం. అనుకోకుండా గాయపడ్డానని క్రిస్టినా స్టివార్ట్ తెలిపింది.

English summary
Actress Kristen Stewart wants to take on an evil role. The actress says she would love to play the role of psychotic Cathy Ames from “East of Eden”.
Please Wait while comments are loading...