twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లుకేమియాతో హాలీవుడ్ సూపర్ హీరో మృతి

    తొలితరం టీవీ సూపర్ హీరో ఆడమ్ వెస్ట్(88) ఇక లేరు. లకేమియాతో శుక్రవారం మరణించారు.

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: తొలితరం టీవీ సూపర్ హీరో ఆడమ్ వెస్ట్(88) ఇక లేరు. కొంతకాలంగా లుకేమియాతో బాధ పడుతున్న ఆయన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి లాస్ ఏంజిల్స్ లో మరణించారు. ఆయన మరణంతో హాలీవుడ్లో విషాదం నెలకొంది.

    1960లలో ప్రసారమైన టీవీ సిరీస్‌లో బ్యాట్‌మన్‌గా నటించి సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆడమ్ వెస్ట్ అప్పట్లో సూపర్ హీరోగా కీర్తికెక్కాడు. ముఖ్యంగా ఆ కాలంలో చిన్న, పెద్ద తేడాలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా ఇష్టపడిన టీవీ సీరిస్ గా బ్యాట్ మెన్ సూపర్ హిట్ అయింది.

     Adam West, Straight-Faced Star of TV's 'Batman,' Dies at 88

    ఆయన నటించిన బ్యాట్‌మన్ మూడు సీజన్లలో ప్రసారమైంది. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో ఆడమ్ వెస్ట్ ఎన్నో సాహసాలు చేసి అలరించారు. అప్పట్లో ఇలాంటి పాత్రలు చేయడం చాలా కష్టంగా ఉండేదని, అదో భయంకరమైన సవాలుతో కూడుకున్నదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆడమ్ వెస్ట్ తెలిపారు. ఆ పాత్ర తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, తనకు 'ఐకానిక్'గా గుర్తింపు తెచ్చిందని తెలిపారు.

    బ్యాట్ మెన్ సిరీస్ తో పాటు అనేక హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆడమ్ వెస్ట్ నటించారు. అప్పట్లో ఆయన చేసిన బ్యాట్ మెన్ టీవీ సీరిస్ ఆధారంగానే తర్వాత హాలీవుడ్లో బ్యాట్ మెన్ సిరీస్ చిత్రాలు రూపొందాయి.

    English summary
    Adam West, the ardent actor who managed to keep his tongue in cheek while wearing the iconic cowl of the Caped Crusader on the classic 1960s series Batman, has died. He was 88.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X