twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాణ వ్యయం 41 కోట్లు, వసూళ్లు రూ. 1000 కోట్లు

    By Bojja Kumar
    |

    లాస్ఏంజిల్స్: సినిమా రంగంలో నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా భారీగా ఉంటాయి. ఒక్కోసారి లాభాలు అంచనాలను అధిగమించి ఆకాశాన్ని అందుకుంటాయి. తాజాగా హాలీవుడ్ సూపర్ నాచురల్ హారర్ మూవీ ‘అన్నాబెల్లే' చిత్రం తెచ్చి పెడుతున్న లాభాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    కేవలం 6.7 మిలియన్‌ డాలర్లు (రూ. 41 కోట్లు) వ్యయంతో నిర్మించని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి 166 మిలియన్‌ డాలర్లను (రూ. 1018 కోట్లు) వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ డిస్ట్రిబ్యూట్ చేసింది.

    ANNABELLE’ SCARES UP $166M

    ఆత్మ ఆవహించిన బొమ్మ కథతో తయారైన ఈ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం 74 మిలియన్‌ డాలర్లు (రూ. 454 కోట్లు) వసూలు చేయగా, ఇతర దేశాలన్నింటిలో కలిపి 92 మిలియన్‌ డాలర్లు (రూ. 564 కోట్లు) వసూలు చేసింది.

    ఈ చిత్రానికి జాన్ ఆర్ లియోనెట్టి దర్శకత్వం వహించారు. పీటర్ సఫ్రాన్, జేమ్స్ వాన్ నిర్మించారు. గ్యారీ డామర్మేన్ కథ అందించారు. అన్నా బెల్లె వాలిస్, వార్డ్ హార్టన్, ఆల్ఫ్రీ ఉడర్డ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 3వ తేదీన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కేవలం మూడు వారాల్లోనే ఈచిత్రం ఈ రేంజిలో వసూళ్లు సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    English summary
    New Line and Warner Bros.’ horror prequel Annabelle likewise remains a strong global player, finishing Sunday with an impressive $166.1 million in total ticket sales, including $95 million overseas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X