»   »  అనుపమ్ ఖేర్ 500వ చిత్రానికి దిమ్మతిరిగే ధర

అనుపమ్ ఖేర్ 500వ చిత్రానికి దిమ్మతిరిగే ధర

ప్రముఖ రచయిత ఎమిలీ వీ గార్డన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమెరికా హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయింది.

Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన 'ది బిగ్ సిక్' అనే హాలీవుడ్ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను అమెజాన్ స్టూడియోస్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకొన్నది. ఈ చిత్ర హక్కులను పొందడానికి పలు సంస్థలు పోటీపడగా దాదాపు రూ.

Anupam Kher, Hollywood, The Big Sick, Emily V Gordon, Nanjiani, 81 crore

81 కోట్లు చెల్లించి అమెరికా రైట్స్ ను అమెజాన్ స్టూడియోస్ దక్కించుకొన్నది. ఈ చిత్రం అనుపమ్ ఖేర్ కు 500వ చిత్రం కావడం విశేషం. అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, నిర్మాత, టీవీ హోస్ట్ ఎమిలీ వీ గార్డన్ రొమాన్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రం విమర్శల ప్రశంసలందుకున్నది. ది బిగ్ సిక్ చిత్రానికి పాకిస్థాన్ సంతతికి చెందిన కమెడియన్ నంజియానీతో కలిసి స్క్రిప్ట్ ను రూపొందించారు. ఈ చిత్ర హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడంపై అనుపమ్ ఖేర్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఎన్నో సంచలనాలను సృష్టిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.

English summary
Anumpam Kher's 500th Film american rights get amazon Studios. Company pays 81 crores for the movie rights.
Please Wait while comments are loading...