»   » 2014 లో సినిమాలుగా వచ్చిన బెస్ట్ బుక్స్ (ఫొటో ఫీచర్)

2014 లో సినిమాలుగా వచ్చిన బెస్ట్ బుక్స్ (ఫొటో ఫీచర్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

న్యూ యార్క్: పాఠకాదరణ పొందిన బెస్ట్ పుస్తకాలు నుంచి సినిమాలుగా రూపొందించటం అనే పక్రియ ..నిన్న మొన్నటి దాకా సాగింది. అయితే రాను రాను అది తగ్గిపోయింది. నవలలను సినిమాలుగా రూపొందించే పక్రియకు దాదాపు అందరు మేకర్స్ ఫుల్ స్టాఫ్ పెట్టేసారు. అయితే ఇప్పటికీ అరకొరగా అక్కడక్కడా బెస్ట్ బుక్స్ అనేవి సినిమాలు అవుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిజానికి పుస్తకాలు సినిమాలుగా రూపొంది హిట్ అవటం అనేది కాస్త కష్టమైన పక్రియ. అందుకే ఎవరూ ధైర్యం చెయ్యరు. పుస్తకం రైట్స్ కొని తర్వాత దాన్ని స్క్రీన్ రైటర్స్ చేత సినిమాకు అణుగుణంగా మార్పించటం అనేది డబ్బు,టైమ్ తో కూడుకున్నది.

ఎంతో కష్టపడి ఇలా తెరకెక్కించిన తర్వాత..పుస్తకంలో ఉన్న ఫీల్ రాలేదని పాఠకులు ఆ సినిమాలను తిరస్కరించటం కూడా చాలా సార్లు జరిగింది. ఎందుకంటే పుస్తకం చదివేటప్పుడు ఎవరి విజువలైజేషన్ కు తగినట్లు వారు ఊహించుకుంటూంటారు. అది తెరపై కనపడకపోయే సరికి నిరాసచెందుతూంటారు.

2014లో హాలీవుడ్ లో తెరకెక్కిన పుస్తకాలు ఇవి...

The Fault in our Stars

జాన్ గ్రీన్ రాసిన ఈ నవలలాగానే సినిమా కూడా హిట్టైంది. ప్రేమ, విషాదం సినిమాలనూ ప్రేక్షకులను వెంటాడాయి.

 

The Maze Runner

ఇది జేమ్స్ డాషనర్ రాసిన బెస్ట్ సెల్లర్ పుస్తకం ఆధారంగా రూపొందిన చిత్రం. ఇదీ ప్రేక్షకాదరణ బాగానే పొందింది.

 

Mockingjay

 

హంగర్ గేమ్స్ లో ధర్డ్ ఇనిస్టాలమెంట్ ఇది. ఇది బెస్ట్ బుక్ సెల్లర్ గా నిలిచింది. దీన్ని సినిమాగా మలిచారు. ఈ చిత్రం రెండో పార్ట్ త్వరలో విడుదల అవుతుంది.

 

The Hundred-Foot Journey

 

ఇదే పేరుతో రిచ్చర్డ్ మోరిస్ సి రాసిన ఈ నవల తెరకెక్కింది. స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి ప్రముఖులు ఈ నిర్మాణంలో పాలుపంచునకున్నారు. ఓమ్ పురి ఇందులో కీలకమైన పాత్రను పోషించారు.

 

Inherent Vice

 

ఇది Thomas Pynchon సినిమాగా ఎడాప్ట్ చేయబడ్డ మొదటి పుస్తకం. బెస్ట్ ఎడాప్టెడ్ స్క్రీన్ ప్లేగా పేరుతెచ్చుకుంది.

 

Gone Girl

 

Gillian Flynn రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఇది. ఈ ఎడాప్షన్ కు మిక్సెడ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది నవలే బాగుంది అన్నారు. అయితే ఇందులో నటించిన హీరోయిన్...ఆస్కార్ నామినేషన్ కు వెళ్లటం విశేషం.

 

Divergent

 

Veronica Roth ఈ పుస్తకం ద్వారా రచయితగా పరిచయమయ్యారు. ఇది మంచి ఎడాప్షన్ అని పేరు వచ్చింది.

 

Serena

 

ఇదే పేరుతో రోన్ రాష్ రాసిన ఈ నవల తెరకెక్కి మంచి పేరు తెచ్చుకుంది. జెన్నీఫర్ లారెన్స్, బ్రాడ్లి కూపర్ ఇందులో నటించారు.

 

Double

 

ఇదే టైటిల్ తో రూపొందిన ఈ నవలలాగే సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది. మంచి థ్రిల్లర్ చిత్రం కావటంతో ఓ వర్గాన్ని బాగానే ఆకర్షించింది.

 

Wild

 

ఓ అమ్మాయి జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లును చిత్రీకరిస్తూ ఈ నవల సాగింది. చాలా భావోద్వేగంగా ఉండే ఈ నవలను సినిమాగానూ అంతే ఎమోషనల్ గా తెరకెక్కించటం విశేషం.

 

Alan Turing: The Enigma

 

బ్రిటన్ గణితకారుడు Alan Turing కథను చెప్తూ సాగే ఈ పుస్తకం లాగే సినిమా కూడా బాగా పేరు సంపాదించుకుంది. రెండవ ప్రపంచ యుద్దం సమయంలో నాజీ కోడ్ లను క్రాక్ చేస్తూ సాగే విధానం ఆకక్తికరంగా ఉంటుంది. ఎనిమిది ఆస్కార్ నామినేషన్స్ పొందిందీ చిత్రం.

 

American Sniper

 

Chris Kyle ఆటోబయోగ్రఫీ ఇది. బ్రాడ్లీ కూపర్ నటించిన ఈ చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ కు నామినేట్ అయ్యారు.

 

English summary
Now the wait is not over as 2015 is also loaded with some of the bestselling novels to film adaptations. From Gillian Flynn's Dark Places to the erotic Fifty Shades of Grey, we have it all in store for you. Here is a look at the best book to film adaptations of 2014.
Please Wait while comments are loading...