»   » ఆమెకు శృంగార యావ ఎక్కువే! (బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్)

ఆమెకు శృంగార యావ ఎక్కువే! (బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తన సింగింగ్ టాలెంటుతో పాటు, సెక్సీ అందాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఏర్పరుచుకుంది. ఎప్పటికప్పుడు తన అందాలను మరింత పదును పెడుతూ ఎవర్ గ్రీన్ శృంగార దేవతలా నిరాజనాలు అందుకుంటోంది.

ఇపుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే...ఈ రోజు బ్రిట్నీ స్పియర్స్ పుట్టినరోజు. నేటితో ఆమె 34వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ప్రొఫెషనల్‌గా సక్సెస్ ఫుల్ స్టార్ అయిన బ్రిట్నీ స్పియర్స్....వ్యక్తిగత జీవితం ఓ సంచలనం. ఇప్పటికి ఇద్దరిని పెళ్లాడి, ఇద్దరికీ విడాకులు ఇచ్చిన బ్రిట్నీ ఇద్దరు పిల్లల తల్లి.

అయితే ఆమెకు భర్తలు ఇద్దరే అయినా బాయ్ ఫ్రెండ్స్‌ను మాత్రం చాలా మంది ఉన్నారు. ఆమె ఎఫైర్ల గురిచి ఇంటర్నేషనల్ మీడియాలో తరచూ గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఆమె ఎఫైర్లు, లవ్, డేటింగులు ఈ లిస్టు పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

చార్లి ఇబెర్సోల్


ప్రస్తుతం బ్రిట్నీ స్పియర్స్ టీవీ ప్రొడ్యూసర్ అయిన చార్లీతో డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి దిగిన చాలా ఫోటోలు తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేయడం ద్వారా తమ మధ్య డేటింగ్ నడుస్తోందని డిక్లేర్ చేసింది బ్రిట్నీ.

రెగ్ జోన్స్


14 ఏళ్ల వయసులోనే బ్రిట్నీ స్పియర్స్ రెగ్ జోన్స్‌‍తో తొలి డేటింగ్ చేసింది. ఇతని ద్వారానే ఆమె కన్యత్వం కోల్పోయినట్లు మీడియా టాక్.

జస్టిన్ టింబర్లేక్


బ్రిట్నీ స్పియర్స్ కెరీర్లో చాలా పాపులర్ అయిన ఎఫైర్ జస్టిన్ టింబర్లేక్‌తో. ఇద్దరూ సరిజోడీ అంటూ అప్పట్లో మీడియా ఊదరగొట్టింది. 1998 నుండి 2002 వరకు ఇద్దరూ రొమాన్స్ కొనసాగించి తర్వాత విడిపోయారు.

వేడ్ రాబ్సన్


టింబర్లేక్‌తో బ్రేకప్ అయిన తర్వాత బ్రిట్నీ స్పియర్స్ డాన్స్ కొరియోగ్రాఫర్ వేడ్ రాబ్సన్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ఫ్రెడ్ డురస్ట్


వేడ్ రాబ్సన్ తో విడిపోయిన తర్వాత బ్రిట్నీ...ఫ్రెడ్ డర్‌స్ట్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అతను ఖండించాడు.

జారెడ్ లెటో


2003లో కొంతకాలం పాటు బ్రిట్నీ సింగిల్ గానే ఉంది. ఆ సమయంలో ఆమెకు పలువురు స్టార్స్ తో లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అందులో జారెడ్ లెటో పేరు కూడా ఉంది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము మంచి స్నేహితులం మాత్రమే అని అతడు స్పష్టం చేసాడు.

కోలిన్ ఫారెల్


2003లో ఓ రెడ్ కార్పెట్ షోకు కోలిన్ ఫారెల్ తో హాజరైంది బ్రిట్నీ. అంతా ఆశ్చర్య పోయారు. తర్వాత ఇద్దరూ బాల్కనీలో ముద్దు పెట్టుకుంటూ మీడియాకు దొరికి పోయారు. బ్రిట్నీ ఒంటరిగా ఉండటంతో ఆమెతో మంచి టైం స్పెండ్ చేసానని చెప్పడంతో ఇద్దరి మధ్య జరిగిన విషయం అందరికీ అర్థమైంది.

కొలంబస్ షార్ట్


కొంతకాలం పాటు బ్రిట్నీ స్పియర్స్ తన డాన్స్ బృందంలో పని చేసే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

జాసన్ అలెగ్జాండర్


2004లో బ్రిట్నీ స్పియర్స్ తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌తో కొంతకాలం డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన 55 గంటల్లోనే ఇద్దరూ వివాహాన్ని రద్దు చేసుకున్నారు.

కెల్విన్ ఫెడర్లైన్


బ్రిట్నీ జీవితంలో ఇది పర్ ఫెక్ట్ మ్యారేజ్. 2004 నుండి 2007 వరకు కాపురం చేసారు. వీరికి ఇద్దరూ సంతానం కూడా కలిగారు. తర్వాత విడిపోయారు.

జేఆర్ రొటెమ్


కెల్విన్ ఫెడర్లెన్ తో విడాకుల తర్వాత మ్యూజిక్ ప్రొడ్యూసర్ జెఆర్ రొటెమ్ తో డేటింగ్ చేసింది బ్రిట్నీ.

హోవీ డే


2007లో కొంత కాలం సింగర్ హోవీ డేతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇసాక్ చోహెన్


ఇతనితో కూడా బ్రిట్నీ కొంత కాలం కొమాన్స్ చేసినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

అద్నన్ ఘాలిబ్


అద్నన్ ఘాలిబ్ తో కూడా బ్రిట్నీ స్పియర్స్ కొంతకాలం డేటింగ్ చేసినట్లు మీడియా టాక్.

జాసన్ ట్రావిక్


29 నుండి జాసన్ ట్రావిక్ తో బ్రిట్నీ డేటింగులో ఉంది. 2011లో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే 2013లో ఇద్దరూ వీడిపోయారు.

డేవిడ్ లుకాడో


కొంతకాలం పాటు డేవిడ్ లుకాడాతో డేటింగ్ చేసింది బ్రిట్నీ.

English summary
It is the birthday of controversial singer, Britney Spears. The diva who shot to fame at a very young age with 'Baby One More Time' turns 34 today. As expected, it is hard for a diva like Britney Spears to keep her love life under wraps.
Please Wait while comments are loading...