»   » జాకీఛాన్ అభిమానులుకు దుర్వార్త

జాకీఛాన్ అభిమానులుకు దుర్వార్త

Posted by:
Subscribe to Filmibeat Telugu
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జాకీఛాన్...తన అభిమానలుకు ఓ ప్రకటనతో షాకిచ్చారు. యాక్షన్ సినిమాలనుంచి తాను రిటైర్ అవుతానని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన కేన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రకటించారు. ఆయన నటించిన తాజా చిత్రం 'చైనీస్‌ జోడియాక్‌'. దాంతో ఆయన అభిమానులు నిరాశపడిపోయారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..''నటుడికి జీవితం ఎక్కువే ఉంటుంది. కానీ యాక్షన్‌ స్టార్ల జీవితం మాత్రం పరిమితం. ఇక తెరపై పోరాటాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకొన్నాను. కొందరు 'మీరు ఇంకా చలాకీగానే కనిపిస్తున్నారు కదా' అని అంటున్నారు. నిజమే కావచ్చు.. కానీ ఏదోక రోజు విరమణ ప్రకటించాలి కదా. ఇప్పుడు నేను చేసిన చైనీస్‌ జోడియాక్‌ చిత్రం గురించి ఎప్పట్నించో కలగంటున్నాను. గత పదేళ్లు ఈ సినిమాకు దర్శకత్వం వహించేవాళ్ల గురించి వెదికాను. ఇక నేనే దర్శకత్వ బాధ్యతలు తీసుకొన్నాను'' అన్నారు.

ఇక వెండి తెరపై కరాటే విన్యాసాలు అనగానే జాకీచాన్‌ గుర్తుకొస్తారు. చైనా యుద్ధ కళలతో జాకీ చేసే పోరాటాలంటే యాక్షన్‌ సినిమా ప్రియులకు చెప్పలేనంత ఇష్టం. జాకీచాన్‌ ఇక పోరాటాలకు స్వస్తి చెప్పేశారు. దీని తరవాత ఇక యాక్షన్‌ చిత్రాలు చేయకూడదని జాకీ నిర్ణయించుకోవటం ఆయన అభిమానలుకు మింగుపడు పడటం లేదు. జాకీ ఛాన్ కు ఇండియాలోనూ ఓ రేంజి అబిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఆస్కార్ రవిచంద్రన్ ఆయన్ని ఇక్కడ తన సినిమాలో నటింపచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే కార్యరూపం దాల్చటం లేదు. అయితే ఈ సారి తమిళ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో ఈ కలని పండించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. '3 ఇడియట్స్‌'కు తమిళ రీమేక్‌ 'నన్బన్‌' చిత్రానికి మంచి టాక్‌ రావటంతో ప్రస్తుతం విజయానందంలో ఉన్న దర్శకుడు శంకర్‌తో రవిచంద్రన్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు.

మూడు భాషల్లో రూపొందే ఆ చిత్రం తమిళ వెర్షన్‌కు 'తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌' అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో జాకీ ఛాన్,కత్రినా కైఫ్ లను నటింపచేసి ఆసియా మార్కెట్ నే టార్గెట్ చేయాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం తెలుగు,తమిళం,హిందీలతో పాటు మిగతా భారతీయ భాషల్లో,ఆసియా దేశాల్లో సబ్ టైటిల్స్ తో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు చర్చల స్ధాయిలోనే ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే..ప్రస్తుతం కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 'విశ్వరూపం' ఈ సంవత్సరం విడుదలైన తర్వాత ఈ త్రిభాషా చిత్రం షూటింగ్‌ ప్రారంభం కావచ్చు. ఇంతకుముందు ఆస్కార్ రవిచంద్రన్ ..కమల్ తో 'దశావతారం'నిర్మించారు.

English summary
ASIAN action hero Jackie Chan announced his retirement from action films at the recent Cannes Festival. The Hong Kong actor said that people never believe him when he says he is going to retire, but Chan told the Associated Press (AP) that: "I have to stop one day." But the good news is, the 58-year-old is not going to stop acting entirely. Taking his cue from Hollywood actors like Robert DeNiro and Clint Eastwood, he said that he will continue to make films with more acting than action. At Cannes, he also launched his final action movie, Chinese Zodiac, in which his character searches for the 12 bronze heads of the Chinese zodiac.
Please Wait while comments are loading...