twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైనోసారస్ ప్రపంచంలోకి స్వాగతం: ‘జురాసిక్ వరల్డ్’

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ సినిమాలైన ‘జురాసిక్ పార్క్' సిరీస్ చిత్రాల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇప్పటికే మూడు సిరీస్ సినిమాలు వచ్చాయి. తాజాగా నాలుగో సిరీస్ రాబోతోంది. ‘జురాసిక్ వరల్డ్' పేరుతో రాబోతున్న ఈచిత్రం వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    తాజాగా ‘జురాసిక్ వరల్డ్' టీజర్ విడుదలైంది. ఈ నెల 27న ఈ చిత్రానికి సంబంధించిన అపీషియల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

    Jurassic World Teaser: A Tribute To 1993's Hit

    ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 12, 2015న ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. ఈ నెల 27న విడుదలయ్యే ‘జూరాసిక్ వరల్డ్' అపీషియల్ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    "The park is open" is what we see first in the 'Jurassic World' teaser which has been released by Universal Pictures. The teaser also shows a massive gate which opens and marks the entry into the world of dinosaurs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X