twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'స్పైడర్‌ మ్యాన్‌' ఫ్యాన్స్ కు శుభవార్త

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : 'స్పైడర్‌ మ్యాన్‌' సీరిస్ లో వస్తున్న చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. అది గమనించే ఈ చిత్రాల్లో ఎప్పటికప్పుడూ మార్పులు చేస్తూ వస్తున్నారు నిర్మాతలు, దర్శకులు. కొత్తదనం లేకపోతే సీక్వెల్స్ భరించటం కష్టమని అర్దం చేసుకున్న యూనిట్ వాటిపై నిరంతరం కసరత్తు చేస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రతీసారిలాగే ఈ సారి స్క్రిప్టు లో ఎలాగు కొత్తదనం ఉంటుంది..దానికి తోడు విలన్స్ కూడా కొత్తగా చూపాలని నిర్ణయించుకున్నామని చెప్తున్నారు. తమ తాజా చిత్రం యాంట్ మ్యాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మార్వెల్‌ స్టూడియోస్‌ సంస్థ అధ్యక్షుడు కెవిన్‌ ఫ్రెడ్జ్‌ తెలిపారు.

    ఆయన మాట్లాడుతూ... కొత్త స్పైడర్‌ మ్యాన్‌ చిత్రంలో విలన్లు కూడా కొత్త వారే కనిపిస్తారని తెలిపారు. గతంలో వచ్చిన స్పైడర్‌ మ్యాన్‌ చిత్రాల్లో డాక్టర్‌ ఆక్టోపస్‌, శాండ్‌ మ్యాన్‌ తదితరులు విలన్లుగా కనిపించారని అయితే ఈ చిత్రంలో మళ్లీ వారినే విలన్లుగా చూపించదలుచుకోలేదని తెలిపారు.

    అభిమానులు ఇప్పటి వరకు ఎక్కడా చూడలేని పాత్రను ఈ చిత్రంలో విలన్‌ పాత్రకు ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. స్పైడర్ మ్యాన్ కొత్త చిత్రం జూలై 28, 2017లో విడుదల కానుంది. ఈ చిత్రం గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని ఖచ్చితంగా మరింత ప్రజాదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

     Spider-Man

    మరిన్ని విశేషాలు...

    స్పైడర్‌ మాన్‌గా మారిన హీరోపీటర్‌ పార్కర్‌ హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు చేసిన సాహసాలు గుర్తున్నాయి కదా. ఈ కొత్త చిత్రాన్ని కూడా స్పైడర్‌ మా స్కూల్‌ జీవితం ప్రధానాంశంగా తెరకెక్కించనున్నారు. స్పైడర్‌ మాన్‌ చిత్రాలు నిర్మించే మార్వెల్‌ స్టూడియోస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ ఫీగ్‌ ఈ విషయం తెలిపారు.

    'హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు స్పైడర్‌ మాన్‌ చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఈ చిత్రంలో వాటిని ప్రేక్షకులను మరింత వినోదాన్ని అందించేలా తీర్చిదిద్దుతామ''ని కెవిన్‌ చెప్పారు.

    సోనీ పిక్చర్స్, మార్వెల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ పాత్ర కోసం 19 సంవత్సరాల బ్రిటీష్ నటుడు టామ్ హోలాండ్‌ను ఎంపిక చేశారు. స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ సినిమాకు జాన్ వాట్స్ దర్శకత్వం వహించనున్నారు.

    సోనీ పిక్చర్స్ ఛైర్మన్ రోత్ మన్ మాట్లాడుతూ.. హీరో పాత్ర కోసం ఎందరో యువ నటుల్ని పరిశీలించామని చెప్పారు. టామ్ స్కీన్ ప్రత్యేకంగా కనిపించాడని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.

    ఈ కొత్త స్పైడర్ మ్యాన్ చిత్రం పీటర్ పార్కర్ విద్యాబ్యాసం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కాగా, 2012లో విడుదలైన సునామీ డ్రామా 'ది ఇంపాజిబుల్'లో టామ్ హోలాండ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలో రిలీజ్ కానున్న 'సివిల్ వార్' చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే.

    ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పైడర్ మ్యాన్ చిత్రాలకు గల క్రేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకోని ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాలను మరిపించేలా ఈ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. సరిక్రొత్త సాహాస కృత్యాలతో రూపొందించిన ఈ సినిమా అభిమానులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది.

    English summary
    Marvel Studios and Sony Pictures are thinking in terms of antagonists for 2017's Spider-Man film. In an interview Marvel Studios President Kevin Feige Said... "Right now we're interested in seeing villains we haven't seen before," Feige says, calling the depth and breadth of Spider-Man's rogue's gallery an "advantage." Spider-Man is expected to hit theaters July 28, 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X