twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక్కడ 'బాహుబలి' ...మరి హాలీవుడ్ లో ?

    By Srikanya
    |

    లాస్ ఏంజల్స్ : మనకు ఇక్కడ బాబుబలి చిత్రం అదరకొడుతూంటే...హాలీవుడ్ లో మాత్రం చీమ బలి(సరదాగా అనొచ్చా) అంటే.... 'యాంట్‌ మాన్‌' సినిమా తన కలెక్షన్స్ తో అదరకొడుతోంది. తన సాహసాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ 'యాంట్‌ మాన్‌' ఈ నెల 24న మన దేశంలో అడుగుపెడుతున్నాడు.

    పీటన్‌ రీడ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో యాంట్‌ మాన్‌గా పాల్‌ రడ్‌ నటించాడు. అనేక సూపర్‌ హీరో చిత్రాలు నిర్మించిన మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మాణంలో 'యాంట్‌ మాన్‌' రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్ ఇదిగో...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇంతకీ ఈ యాంట్ మ్యాన్ కథేంటి?

    ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లా ..ఈ యాంట్ మ్యాన్ వెనక కూడా ఓ కథ ఉంది. హ్యాంక్‌ అనే శాస్త్రవేత్త ఓ ప్రత్యేకమైన సూటును, హెల్మెట్‌ను సృష్టిస్తాడు. దాన్ని ధరించిన వారు సూటుకున్న బటన్‌ను నొక్కగానే మూడంగుళాలకు కుచించుకుపోతారు. ఎదుటివారికి చీమలా కనిపిస్తారు. ఆకారం తగ్గినా అత్యంత శక్తిమంతులుగా తయారవుతారు. అవసరమైనప్పుడు మళ్లీ బటన్‌ నొక్కగానే మామూలు ఆకారానికి వచ్చేస్తారు. క్రాస్‌ అనే దుర్మార్గుడు ఆ సూటును దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

    అది దొరికితే తన అరాచకాలకు ఉపయోగించొచ్చనేది క్రాస్‌ కోరిక. క్రాస్‌ స్వార్థం తెలిసిన హ్యాంక్‌ దాన్ని చాలా రహస్యంగా భద్రపరచి ఉంటాడు. అయితే ఓ రోజు హ్యాంక్‌ ఇంట్లోకి చొరబడిన స్కాట్‌ అనే దొంగ ఆ సూటు ప్రత్యేకత ఏంటో తెలియకుండానే దాన్ని దొంగలిస్తాడు.

    ఆ తర్వాత స్కాట్‌కు దాని ప్రత్యేకత అర్థమవుతుంది. అప్పుడు స్కాట్‌ ఏంచేశాడు? ఆ సూటు క్రాస్‌ చేతికి దొరక్కూడదన్న హ్యాంక్‌ కోరిక నెరవేరిందా? అసలు హ్యాంక్‌కు, స్కాట్‌కు ఉన్న సంబంధమేంటి? ఈ విషయాలు తెరమీద చూడాలి.

     Marvel’s Ant-Man to release in India on July 24th!

    కలెక్షన్స్ మాటేంటి...

    ఈ చిత్రం ఇప్పటికే అంటే ఈ నెల 17న విదేశాల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 130 మిలియన్‌ డాలర్ల (రూ.824 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 3 రోజుల్లోనే 114 మిలియన్లు డాలర్లు వసూలు చేసింది.

    కథ వెనక కథ...

    అసలు ఈ కథరాయటానికి ముందు....ఓ చీమకు శక్తులు రావడం ద్వారా మనిషిగా మారే కథతో 'యాంట్‌ మాన్‌' తీయాలనుకున్నారు. కానీ మనిషే చీమగా మారేలా కథను మార్చారు. 'యాంట్‌ మాన్‌' ప్రచారాన్ని విన్నూతంగా చేశారు. టైటిల్‌కు తగ్గట్లే యాంట్‌ సైజ్‌ టీజర్‌ను రూపొందించారు. ఇందులో దృశ్యాలు అతిచిన్నవిగా కనిపిస్తాయి.

    అబ్బో ఎంత కష్టం...

    అనుకున్నంత ఈజీ కాదు..ఇలాంటి సినిమాలు తీయటం.... 'యాంట్‌ మాన్‌' సూట్‌ తయారీకి కాస్ట్యూమ్‌ డిజైనర్లు శామీ షెల్డన్‌, ఐవో కవనీ ఎంతో శ్రమించారు. సూటు, హెల్మెట్‌ల నమూనాలను తొలుత త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సహాయంతో రూపొందించారు. ఆ తర్వాత సూటులోని ఒక్కో విడిభాగాన్ని తయారు చేస్తూ వచ్చారు.

    మొత్తం సూట్‌ తయారయ్యేసరికి ఏడునెలలు పట్టింది. అచ్చు చీమను తలపించేలా సూటుకు భుజాల దగ్గర, ఎద భాగంలో ఎరుపు రంగును వాడారు. హెల్మెట్‌లో నుంచి బయటకు చూడ్డానికి ఉన్న రంధ్రాలను చీమకళ్ల ఆకారంలో రూపొందించారు.

    సినిమాలో యాంట్‌ మాన్‌ పాత్ర కోసం మొత్తం 13 సూట్లు, 17 హెల్మెట్లు, 8 జతల గ్లోవ్స్‌, 15 రకాల బెల్టులు వాడారు. సన్నివేశాలకనుగుణంగా కాస్ట్యూమ్స్‌ రూపొందిచారు. ఈ సూట్ల బరువు ఎక్కువుండటంతో పోరాట సన్నివేశాల కోసం ప్రత్యేకంగా తేలికైన సూట్లు తయారుచేశారు.

    English summary
    After the huge success of Avengers: Age Of Ultron, Marvel’s next superhero offering is the much awaited Ant-Man set to release in India on 24th July! Ant-Man will be the buildup to next year’s Captain America: Civil War.Directed by Peyton Reed and produced by Kevin Feige, Marvel’s Ant-Man delivers a high-stakes, tension-filled adventure on July 24, 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X