»   » ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ ఫ్యాన్స్ కు శుభవార్త, ఆరో పార్ట్ రిలీజ్ డేట్ ఇచ్చేసారు

‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ ఫ్యాన్స్ కు శుభవార్త, ఆరో పార్ట్ రిలీజ్ డేట్ ఇచ్చేసారు

‘మిషన్‌ ఇంపాజిబుల్‌6’ చిత్రం ని శరవేగంతో పూర్తి చేసి జూలై 27, 2018న విడుదల చేయాలని నిర్ణయించారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి సుపరిచితమైన సినిమా 'మిషన్‌ ఇంపాజిబుల్‌' . సీక్రెట్‌ ఏజెన్సీ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌గా 'మిషన్‌ : ఇంపాజిబుల్‌' రూపొందింది. విజువల్‌ ట్రీట్‌తో అబ్బుర పరిచే యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసిన ఈ సిరీస్‌ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇప్పటికి ఈ సీరిస్ లో ఐదు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం కు రంగం సిద్దమైంది.

విడుదలైన ప్రతీసారీ బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపుతున్న 'మిషన్‌ ఇంపాజిబుల్‌' సిరీస్‌లో మరో చిత్రంగా 'మిషన్‌ ఇంపాజిబుల్‌6'ను నిర్మించదలిచినట్లు ప్యారమౌంట్‌ వారు ప్రకటించారు. ఈ చిత్రం ని శరవేగంతో పూర్తి చేసి జూలై 27, 2018న విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు పారామౌంట్ వారు.

‘Mission: Impossible 6’ Gets Summer 2018 Release Date

'మిషన్‌ ఇంపాజిబుల్‌' సిరీస్‌లో ఆరో చిత్రంగా 'మిషన్‌ ఇంపాజిబుల్‌: రోగ్‌ నేషన్‌' చిత్రం 2015లో విడుదల అయింది.గతంలో మిషన్‌ ఇంపాజిబుల్‌ హీరోయిన్ గా రెబెక్కా ఫెర్గ్‌సన్‌ నటించింది. మొత్తం 280 కోట్ల డాలర్‌ల కలెక్షన్‌లతో ఆ చిత్రం నిర్మాతలైన ప్యారమౌంట్‌ను చాలా సంతోషపరిచింది. మళ్లీ మరోసారి అదే స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆశతోనే 'మిషన్‌ ఇంపాజిబుల్‌' సిరీస్‌లో ఆరో చిత్రం తీస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని నిర్మాణంలో స్కైడాన్స్‌ ప్రొడక్షన్స్‌ వారు కూడా పాల్పంచుకుంటారు.

ఈ సిరీస్‌లో ఐదో చిత్రంగా 'రోగ్‌ నేషన్‌' వచ్చినప్పుడే, 'ఇది హిట్‌ అయితే, మీరు ఆరో చిత్రం కూడా చూస్తారు' అంటూ హీరో టామ్‌ క్రూజ్‌ చెప్పారు. ఆ మాట ఇప్పుడు కార్యరూపం ధరిస్తోందన్నమాట! మరి, ఆరో చిత్రానికి కూడా ఐదో చిత్రానికి దర్శకత్వం వహించిన ఈథన్‌ హంట్‌ దర్శకత్వం వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

English summary
Paramount Pictures has scheduled Tom Cruise’s “Mission: Impossible 6” for July, 27, 2018. Cruise had announced in July, 2015, that he planned to go ahead with “Mission: Impossible 6” just as “Mission: Impossible — Rogue Nation” was opening.
Please Wait while comments are loading...