»   » ఇపుడు ఇదో ట్రెండ్: ఆనంద క్షణాలను ఇలా నగ్నంగా....(ఫోటోస్)

ఇపుడు ఇదో ట్రెండ్: ఆనంద క్షణాలను ఇలా నగ్నంగా....(ఫోటోస్)

ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినీ సర్కిల్‌లో ఓ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. గర్భందాల్చిన తర్వాత పలువురు స్టార్లు తమ బేబీ బంప్ ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం...

Posted by:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినీ సర్కిల్‌లో ఓ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. గర్భందాల్చిన తర్వాత పలువురు స్టార్లు తమ బేబీ బంప్ ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం... అది కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా మేగేజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేకంగా ఫోజులు ఇవ్వడం చేస్తున్నారు.

ఇపుడు ఇదే దారిలో మరో స్టార్ నగ్నంగా తన బేబీ బంప్ ను అభిమానుల కోసం ప్రదర్శించింది. హాలీవుడ్ నటి, సింగర్, సాంగర్ రైటర్ పింక్ ఇటీవలే గర్భవతి అయింది. గర్భం దాల్చడం అనేది ఏ మహిళ జీవితంలో అయినా చాలా ఆనందకరమైన క్షణమే.

37 సవత్సరాల పింక్ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇప్పటికే ఆమెకు విల్లో అనే మూడేళ్ల కూతురు ఉంది. కూతురుతో కలిసి దిగిన టాప్ లెస్ ఫోటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసారు.

💫the snuggle is real 📷 :@deborahandersoncreative hair: @pamwiggy hands: willow sage

A photo posted by P!NK (@pink) on

పింగ్ తరహాలోనే గతంలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు బేబీ బంప్ తో నగ్నంగా ఫోజులు ఇచ్చారు. వారికి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

తొలిసారి సంచలనం

1991లో తొలిసారిగా హాలీవుడ్ నటి డెమి మూరె ప్రెగ్నెన్సీ సమయంలో నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అప్పట్లో అదో సంచలనం. తర్వాత ఆమెను చాలా మంది స్టార్స్ ఫాలో అయ్యారు.

జెన్నా డేవన్

హాలీవుడ్ స్టార్ చాన్నింగ్ టాటుమ్ భార్య.... జెన్నా డేవన్ 2013లో పెగ్నెన్సీ సందర్భంగా బేబీ బంప్ ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా ఫోజులు ఇచ్చింది.

మరయ్యా క్యారీ

మరో హాలీవుడ్ సెలబ్రిటీ మరయ్యా క్యారీ లైఫ్ స్టైల్ మేగజైన్ కోసం బేబీ బంప్ తో నగ్నంగా ఫోజులు ఇచ్చింది. 2011లో ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

 

మిరండా ఖెర్

ఆస్ట్రేలియా మోడల్ మిరండా ఖెర్ కూడా 2010లో ప్రెగ్నెంట్ అయినపుడు ఇలా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అసలే అందగత్తె, ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా ఫోజులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.

జెస్సికా సింప్సన్

డెమి మూరెని ఫాలో అవుతూ...... ప్రెగ్నెన్సీతో న్యూడ్ గా ఫోజులు ఇచ్చిన మరో బ్యూటీ హాలీవుడ్ నటి జెస్సికా సింప్సన్. 2012లో ఎల్లో కవర్ పేజీ కోసం జెస్సిగా ఇలా ఒంటపై నూలు పోగు కూడా లేకుండా ఫోజులు ఇచ్చింది.

షకీరా

పాప్ సింగర్ షకీరా కూడా తన భర్త గెరాల్డ్ పిక్ తో కలిసి బేబీ బంప్ ప్రదర్శిస్తూ ఇలా ఫోటోలకు ఫోజలు ఇచ్చింది. 2011లో తన ఫస్ట్ చైల్డ్ కు జన్మనిచ్చిన సందర్భంగా షకీరా ఇలా ఫోజు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బ్రిట్నీ స్పియర్స్

దాదాపు పదేళ్ల క్రితం ఫోటో ఇది. అప్పట్లో పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన 24వ ఏట రెండో సారి ప్రెగ్నెంట్ అయిన సందర్భంగా ఇలా మేగజైన్ కోసం ఫోటోకు ఫోజు ఇచ్చింది.

 

English summary
37-year-old singer, songwriter, dancer and actress Pink, is an expecting mom. She'll soon be a mother of two. Instead of sharing this piece of news that she is expecting her second child the lady posted a picture of hers flaunting baby bump!
Please Wait while comments are loading...