twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వయస్సు అయిపోయినా చించి అరేస్తున్నాడు

    By Srikanya
    |

    న్యూయార్క్ :హాలీవుడ్‌ చరిత్రలో 'టెర్మినేటర్‌' చిత్రంతో ప్రత్యేక అధ్యాయం. మన దేశంలో కూడా అది చిన్న చిన్న టౌన్ లో కూడా వంద రోజులుఆడి రికార్డులు క్రియేట్ చేసింది. అప్పట్లో టెర్మనేటర్..విన్యాసాలకు ,గ్రాఫిక్స్ కు అందరూ అబ్బురు పడి చూసేవారు. అంతేకాదు...ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టిన చిత్రం అది.

    ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు చిత్రాలూ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు 'టెర్మినేటర్‌ జెనిసిస్‌' పేరుతో మరో సీక్వెల్‌ సిద్ధమవుతోంది. రీసెంట్ గా దానికి సంబంధించిన పోస్టర్‌ను హీరో ఆర్నాల్డ్‌ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ కి విశేషాదారణ వచ్చింది.
    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మంటల్లో కాలిపోతున్న ఆర్నాల్డ్‌ (రోబో)తో పాటు ఇతర తారాగణం ఉన్న ఆ పోస్టరు ఆసక్తి రేకెత్తిస్తోంది. అలన్‌ టైలర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జులై 1న విడుదల కానుంది.

    Terminator Genisys on july 1 st

    మరో ప్రక్క
    జురాసిక్ పార్క్ సీక్వెల్ .. 'జురాసిక్‌ వరల్డ్‌' కూడా ఇక్కడ విడుదలకు సిద్దమవుతోంది.క్రిష్‌ ప్రాట్‌, బ్రైస్‌ డల్లాస్‌ హోవార్డ్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌' . కొలిన్‌ ట్రెవ్రో దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని (ట్రైలర్‌) చిత్రబృందం విడుదల చేసింది. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌లోకి సందర్శకుల ప్రవేశం ఆ తర్వాత పరిణామాలను తెలుపుతూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. అమెరికాలో జూన్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటి... అంటే...

    ఓ సెలవు రోజు సరదాగా జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌కు రాకాసి బల్లులను చూద్దామని వస్తారు కొందరు సందర్శకులు. పార్క్‌ అంతా సందర్శకులతో కోలాహలంగా ఉన్న సమయంలో అనుకోని విధంగా రాకాసి బల్లులు ఉగ్రరూపం దాలుస్తాయి. అసలేమైంది... ఆ రాకాసి బల్లులు అలా ఎందుకు మారాయన్నది 'జురాసిక్‌ వరల్డ్‌' చూసి తెలుసుకోవాల్సిందే. జురాసిక్‌ పార్క్‌ను ప్రేక్షకుల సందర్శన కోసం తిరిగి ప్రారంభించడానికి యాజమాన్యం కృత్రిమంగా డైనోసర్‌ను సృష్టిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ జీవి వారి అధీనం నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే పరిణామాల మాలిక ఈ చిత్రం.

    ప్రతిష్ఠాత్మక 'జురాసిక్‌ పార్క్‌' సిరీస్‌లో భాగంగా వస్తోన్న నాలుగో చిత్రం 'జురాసిక్‌ వరల్డ్‌'. క్రిష్‌ ప్రాట్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జురాసిక్‌ వరల్డ్‌ పార్క్‌యజమాని సైమన్‌ మస్రానీ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు ఇర్ఫాన్‌.
    స్పీల్ బర్గ్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన 'జురాసిక్‌ పార్క్‌...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. డైనోసార్ల గురించి ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు 'జురాసిక్‌ వరల్డ్‌' పేరుతో మరో కొత్త సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా పోస్టర్ పై ఇర్ఫాన్ ఖాన్ ని వేసి పబ్లిసిటీ ప్రారంభించారు.

    మరో ప్రక్క ఈ సినిమాను వైవిధ్యమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఈ తాజా చిత్రం కోసం 7 రకాల కొత్త తరహా డైనోసార్‌లను రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన నమూనాలను సైంటిస్టులు తయారు చేసిన విధానాన్ని జురాసిక్‌ వరల్డ్‌ వెబ్‌సైట్‌లో వీడియో, ఫొటోల రూపంలో సినిమా అభిమానులకు అందిస్తున్నారు.
    డైనోసార్లు మళ్లీ పుట్టాయేమో అన్నంత సహజంగా ఉన్న ఆ జీవులను చూసి వీక్షకులు ఆశ్చర్యపోతున్నారట. జురాసిక్‌ పార్క్‌ సందర్శకులకు ఈ కొత్త జీవులను చూసే అవకాశం కల్పించడం విశేషం.

    ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రేస్ డల్లాస్ హోవర్డ్, విన్సెంట్, జేక్ జాన్సన్, నిక్ రాబిసన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. గత సిరీస్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Terminator Genisys is an upcoming 2015 American science fiction action film directed by Alan Taylor and written by Laeta Kalogridis and Patrick Lussier. It is the fifth theatrical film in the Terminator series and acts as a reboot of the series. Arnold Schwarzenegger reprises his role as the eponymous character, along with newcomers Jason Clarke, Emilia Clarke, Jai Courtney, Matt Smith, Lee Byung-hun and J. K. Simmons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X