twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరిపోయింది: ‘ది జంగిల్ బుక్’ అపీషియల్ ట్రైలర్

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజల్స్: చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ అకట్టుకునే సాహసం, వినోదంతో 1967లో వాల్ట్‌ డిస్నీ 'జంగిల్‌ బుక్‌' అనే యానిమేషన్ చిత్రాన్ని నిర్మించింది. అప్పట్లో అది ఎంతో ఆదరణ పొందింది. ఇప్పటికీ టీవీ ప్రసారాల ద్వారా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 3డి లో సరికొత్తగా మరోమారు ' ది జంగిల్‌ బుక్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్ 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన జోన్‌ ఫేవ్‌ర్యూ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో ‘ది జంగిల్ బుక్' విడుదల కానుంది. తాజాగా వాల్ డిస్నీ సంస్థ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసింది.

    అద్భుతమైన సాహసాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఒళ్లు గగుర్బొడిచే గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేలా ఈ సినిమా ఉండబోతోందని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. సినిమాలోని బాలుడు మోగ్లీ క్యారెక్టర్ తప్ప అన్నీ గ్రాఫిక్సే. కానీ రియాల్టీని తలపించేలా గ్రాఫిక్స్ ఉండటం గమనార్హం.

    ప్రధాన పాత్ర మోగ్లీగా నటించే బంగారు అవకాశం న్యూయార్క్‌లో జన్మించిన భారతీయ - అమెరికన్ అయిన నీల్ సేథీని వరించింది. ''ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని వెతికాం. న్యూయార్క్ నుంచి న్యూజిలాండ్ వరకు, లండన్ నుంచి కెనడా వరకు, అమెరికా, భారతదేశం... మూలమూలలా వెదికిన తర్వాత పదేళ్ళ నీల్ సేథీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాం'' అని దర్శకుడు జోన్‌ ఫేవ్‌ర్యూ తెలిపారు.

    The Jungle Book Official Trailer

    అడవిలోని జంతువులు పెంచి పెద్ద చేసిన ఓ పసివాడి కథ ఆధారంగా సాగే చిత్రమే ‘ది జంగిల బుక్'. రుడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన 'ది జంగిల్ బుక్' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథ గతంలో యానిమేషన్ రూపంలో అలరించింది. కాగా, ఇప్పుడు లైవ్ - యాక్షన్, యానిమేషన్‌ల సమ్మిళిత రూపంగా 3డిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సేథీ ఒక్కడే మౌగ్లీగా నటిస్తున్నాడు. అతణ్ణి పెంచే అడవి జంతువుల పాత్రలన్నీ యానిమేషన్, గ్రాఫిక్సే. ఈ పాత్రలకు బెన్ కింగ్‌స్లే లాంటి ప్రసిద్ధులు గాత్రదానం చేయనున్నారు.

    ఎమ్జే ఆంథోని...గ్రే బ్రదర్ పాత్రకు వాయిస్ ఇస్తారు. అలాగే బిల్ ముర్రే..భల్లూ పాత్రకు, బెన్ కింగ్ల్ లే...భగీరా పాత్రకు, ఇడ్రిస్ ఎలబా..షేర్ ఖాన్ పాత్రకు, క్రిష్టపర్ వాల్కన్ ..కింగ్ లూయీ పాత్రకు, స్కార్లెట్ జాన్ సన్..కా పాత్రకు, జింకార్లో ఎస్పిటో...అకేలా పాత్రకు, లుపిటా రక్ష పాత్రకు తమ వాయిస్ లు ఇవ్వనున్నారు. సినిమా ఏప్రిల్ 15, 2016లో విడుదల అవుతుంది.

    English summary
    Watch The Jungle Book Official Trailer. Scarlett Johansson.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X