twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డ్ : 109 దేశాల్లో విడుదల...గేమ్ ల్లో 'బాహుబలి' (వీడియో)

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్‌: వీడియో గేమ్ లు తెలియని పిల్లలు, పెద్దలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ గేమ్ లకు చిన్నపిల్లలైనా.. పెద్దవారైనా.. బానిసలు అవ్వాల్సిందే అనే రీతిలో వీటిని రూపొందిస్తున్నారు. సినిమా తరహాలో వీటి నిర్మాణం, రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి గేమ్ ఒకటు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఏ వీడియోగేమ్‌ పేరు వినబడితే చాలు..జనాలు వాటికి ఇట్టే అతుక్కుపోతారో ఆ గేమే ఇది. పాలిష్‌ వీడియో గేమ్‌ విచర్‌ సిరీస్‌లో మూడో వెర్షన్‌ ది విచర్‌ 3- వైల్డ్‌ హంట్‌. గత మే నెలలో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాల్లో విడుదల చేశారు.

    Video Game: The Witcher 3 has sold 4 million copies

    విడుదలైన రెండు నెలల్లోనే ఈ గేమ్‌ సీడీలు దాదాపు 40లక్షలకు పైగా అమ్ముడయ్యాయి రికార్డులు క్రియేట్ చేస్తోంది. మన దేశంలోనూ చెప్పుకోదగిన రీతిలో ఈ అమ్మకాలు ఉండటం విశేషం. ఇక దీన్ని సినిమావారు గేమ్ ల్లో బాహుబలి అంటున్నారు. వారు అలా ఎందుకు అంటున్నారో ఈ క్రింద వీడియో చూసి చెప్పండి.

    ఇక విచర్‌ మొదటి రెండు సిరీస్‌లను 2007, 2011లలో విడుదల చేశారు. అవి కూడా చాలా పేరొందాయి. ఇప్పుడు ఈ మూడో సిరీస్‌ ప్రపంచ దేశాల్లో తన గుర్తింపును చాటుకుంది.

    పాలిష్‌ వీడియో గేమ్‌ డెవలపర్‌ పావెల్‌ మికవ్‌స్కీ దీనిని రూపొందించారు. అంతేకాదండోయ్‌ గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం ఈ పేరును ప్రస్తావించడం విశేషం.

    English summary
    'The Witcher 3' Sold 4 Million Copies In Two Weeks. CD Projekt Red co-founder Marcin Iwiński says in a blog post. “I’d also like to take this opportunity to thank the four million gamers worldwide who bought The Witcher 3: Wild Hunt in the first two weeks from launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X