twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2014 లో వచ్చిన వరస్ట్ చిత్రాలు (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    న్యూయార్క్: 2014 ఎప్పటిలాగే కొన్ని హిట్లు, మరికొన్ని ఫ్లాపులతో దూసుకుపోతోంది. సినిమా లవర్స్ ఎప్పటిలాగే ఏ మాత్రం బాగున్నా ఆదరిస్తున్నారు. తెలుగులోనూ అదే పరిస్ధితి, తమిళంలోనూ, హిందీలోనూ, చివరకు హాలీవుడ్ లోనూ సేమ్ సిట్యువేషన్. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం హాలీవుడ్ లో భారీ చిత్రాల్లో ఏవి చెత్తగా ఉన్నాయో...గుర్తు చేసుకుందాం.. ఈ లిస్ట్ ని రెవిన్యూ వైపు నుంచి కాకుండా క్రిటిక్స్ రేటింగ్ నుంచి తీసుకోవటం జరిగింది.

    Transformers 4, Captain America 2, Rio 2, Amazing Spider Man 2,Maleficent వంటివి ఈ సంవత్సరం హైయిస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. చిన్నా పెద్దా లేకుండా అంతా వీటిని ఆదరించారు. అయితే 2014 లో కొన్ని ఊహించని ఫ్లాఫులు వచ్చాయి. భారి అంచనాలతో వచ్చిన ఈ చిత్రాలు భాక్సాఫీస్ ని గెలవలేకపోయాయి.

    కొన్ని హాలీవుడ్ చిత్రాలు అయితే అసలు వచ్చి వెళ్లిన విషయమే ఎవరకీ తెలియలేదు. ట్రైలర్స్ చాలా ఇంటర్టింగ్ ఉండి, సినిమా ఫెయిల్యూర్స్ అయిన బాపతులో ఇవి చేరుతాయి. అలాంటివి కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.

    అటు భాక్సాఫీస్ ని, ఇటు క్రిటిక్స్ ని ఇద్దరినీ నిరాశపరిచిన చిత్రాలు... స్లైడ్ షోలో

    Expendables 3

    Expendables 3

    ఈ చిత్రం రిలీజ్ ముందే ఆన్ లైన్ లో లీకైంది. దాంతో ఈ చిత్రం బిజినెస్ పై పూర్తిగా ఎఫెక్టు పడింది. ఎన్నో అంచనాలుతో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు నష్టం మిగిల్చింది.

    Transformers: Age of Extinction

    Transformers: Age of Extinction

    ఈ మార్వెల్ మూవీ...భాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ గా వర్కవుట్ అయ్యి... హైయిస్ట్ గ్రాసర్స్ గా నిలిచింది. అయితే క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాని చెత్త సినిమాగా అభివర్ణించారు. కథ చాలా డ్రాగ్ అయ్యింద ని, అసలు బలం లేని సన్నివేశాలని తిట్టిపోసారు.

    Transcendence

    Transcendence


    జానీ డెప్ హీరోగా వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ...ట్రైలర్ లో ఉన్నంత గా ఇంప్రెస్ చేయలేకపోయిందని అంతా పెదవి విరిచారు.

    Hercules

    Hercules


    ఈ సీక్వెల్ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే విజువల్ ఎఫెక్టు కోసం తప్ప ఎందుకు పనికిరాని చెత్తగా తేలింది చివరకు.

    Godzilla 2014

    Godzilla 2014

    ఈ సినిమా రిలీజ్ కు ముందు ఓ రేంజిలో హైప్ ఏర్పడింది. ప్రాఛైజ్ చిత్రం కావటంతో మంచి క్రేజ్ వచ్చింది. $200 మిలియన్స్ వసూలు చేస్తుందని అంచనా వేసారు. అయితే దాని దరిదాపుల్లోకి కాదు కదా...దగ్గరకు కూడా వెళ్లలేకపోయింది.

    Robocop

    Robocop

    1990 లో వచ్చిన హిట్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద అసలు ఇంపాక్ట్ కగలచేయలేకపోయింది. దీనిపై మంచి అంచనాలు ఉన్నా ఫలితం లేదు..ఓపినింగ్స్ కూడా రాబట్టలేదు.

     Into The Storm

    Into The Storm


    ఈ చిత్రం ట్రైలర్ ..ప్రామిసింగ్ గా ఉన్నా... సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. చూసిన వారు, చూడని వారు దీన్ని దుమ్మెత్తిపోసారు.

    The Amazing Spider-Man 2

    The Amazing Spider-Man 2

    ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేసింది. అలాగే రిలీజ్ తర్వాత భాక్సాఫీస్ వద్ద సైతం బాగానే సందడి చేసింది. అయితే క్రిటిక్స్ మాత్రం ఇది స్పైడర్ మ్యాన్ సీరిస్ కి తగ్గట్లు లేదని తేల్చేసారు. క్యారక్టరైజేషన్స్ అవీ సరిగ్గా లేవు అన్నారు.

    Blended

    Blended


    గతంలో 50 ఫస్ట్ డేట్స్ చిత్రంలో చేసిన ఈ జంటపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఆ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. అసలు ఈ చిత్రం వచ్చిందనే సంగతే తెలియనంత స్పీడుగా వెనక్కి వెళ్లిపోయింది.

    English summary
    Here is a look at some of the worst Hollywood movies of 2014 so far which were real disappointment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X