twitter
    TelugubredcrumbMoviesbredcrumbA AabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇది ఫలానా రచయిత రాసిన డైలాగు అని చెప్పగలిగేలా ముద్రవేయటం మామూలు విషయం కాదు. అది త్రివిక్రమ్ సాధించాడు. త్రివిక్రమ్...ఫీల్ గుడ్ ప్రేమ కథలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా రొమాంటిక్ కామెడీలు తొలినాళ్లలో వండర్స్ సృష్టించి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. దర్శకుడుగా మారాక యాక్షన్ ఎంటర్టైనర్స్ వైపు కు టర్న్ తీసుకున్న ఆయన అత్తారింటికి దారేదితో మళ్లీ తనదైన శైలి ఫ్యామిలీ డ్రామాల వైపు దృష్టి పెట్టారు.

      ఇది త్రివిక్రమ్ సినిమా కాదు..కాదు... నితిన్ సినిమా ఇలా రెండు విధాలుగా ఎక్సెపెక్ట్ చేసి వెళితే మీరు బోల్తా పడినట్లే... ఎందుకంటే ఇది ఖచ్చితంగా హండ్రడ్ పర్శంట్ సమంత సినిమా. ఆమె చుట్టూ అల్లిన కథ. ఆమె ఫెరఫార్మెన్స్ తో నడిచిన కథ. ఆమెను హైలెట్ చేయటం కోసమే అన్నట్లుగా త్రివిక్రమ్ తన మార్కుని వదిలేసాడు. నితిన్ అయితే కేవలం ఓ పాత్రలా మిగిలిపోయాడు. ఇలా దర్శకుడు హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుకున్నప్పుడు, మళయాళి చిత్రం 'ఓం శాంతి ఓషానా' తరహాలో పూర్తిగా ఆమెనే హెలెట్ చేస్తూ, ఓ స్టారడమ్ లేని హీరోని తీసుకుని నడిపితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోను. అలా కాకుండా నితిన్ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని సీన్ లోకి తేవటంతో నితిన్ ఏమి చెయ్యడేంటి, అతను తన ప్రేమ కోసం ఎక్కడా ఏ డెషిషన్ తీసుకోడేంటి.. అంటూ తొలిచేస్తూంటుంది. ఎందుకంటే నితిన్ ..తొలి చిత్రం నుంచి ప్రేమ కోసం ఓ రేంజిలో పోరాటాలు చేసిన హీరో కదా. కాబట్టి సమంత సినిమా అనుకుని చూస్తే బాగుందే అనిపిస్తుంది. త్రివిక్రమ్ నుంచి పంచ్ లు, నితిన్ నుంచి ఇంకేమి ఆశించకుండా వెళ్తే హ్యాపీగా అనిపించే వన్ ఉమెన్ షో ఇది. ఆమె అభిమానులు పండుగ చేసుకునే చిత్రం ఇది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X