twitter
    TelugubredcrumbMoviesbredcrumbAbhinetribredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • కృష్ణ పాత్రలో ప్రభుదేవా ఆకట్టుకున్నాడు. నటనతో పాటు కామెడీ టైమింగ్, డాన్సింగ్ తో అలరించాడు. తమన్నా... దేవి, రూబీ రెండు విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. రెండు పాత్రల్లో వేరియేషన్స్ అద్భుతంగా ప్రదర్శించింది. ప్రభుదేవాతో పోటీ పడి నటించింది. సినీ స్టార్ పాత్రలో సోనూసూద్‌ ఓకే. సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడు ఎఎల్. విజయ్ సినిమాను బాగా హ్యాండిల్ చేసాడు. కథను నేరేట్ చేసిన విధానం బావుంది. కథకు ఎంత అవసరమో అంతే హారర్ ఎలిమెంటును జోప్పించారే తప్ప కావాలని అనవసరమైన హారర్ సీన్లు, భయపెట్టే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టలేదు. హారర్ తక్కువైనా కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో సఫలం అయ్యాడు. హారర్ సినిమాల్లో సాధారణంగా దెయ్యం పగ తీర్చుకునే సన్నివేశాలుంటాయి. ఇందులో అలా పెట్టకుండా ఆత్మ హీరోయిన్ కావాలనే ఒక లక్ష్యంతో కనిపిస్తుంది. అయితే కథనం ఆకట్టుకునే విధంగా లేదు. సెకండాఫ్ సాగదీసినట్లు ఉండటం, లాజిక్ లేని కొన్ని సీన్లు మైనస్ అనిపిస్తాయి.
      కథ, కథనం కొత్తగా లేక పోయినా.... సస్పెన్స్, ట్విస్టులు కనిపించక పోయినా సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ జోడించి వినోదాత్మకంగా నడిపించడం వల్ల ప్రేక్షకులు బోర్ పీలవ్వరు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X