twitter

    విమర్శకుల సమీక్ష

    • బాహుబలి ది బిగినింగ్ ముగిసిన చోటు నుంచి బాహుబలి2 ప్రారంభమవుతుంది. బాహుబలి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలికి కట్టప్ప చెప్పడం ప్రారంభిస్తాడు. బాహుబలి3 ఫస్టాఫ్‌లో మహేంద్ర బాహుబలికి సంబంధించిన బిల్డప్ షాట్స్ అద్బుతంగా ఉంటాయి. శివగామి పూజకు బయలుదేరిన సమయంలో ఎదురైన ఆటంకాలను అడ్డుకునేకుందుకు బాహుబలి ఇచ్చిన ఎంట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే రేంజ్‌లో రాజమౌళి చిత్రీకరించాడు. సాహోరే బాహుబలి పాటలో బాహుబలి శక్తి, సామర్థ్యాలను కళ్లకు గట్టినట్టు చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కుంతల దేశ యువరాణి బాహుబలిని ఎవరు నువ్వు అని నిలదీసినప్పుడు బాహుబలి గురించి కట్టప్ప చెప్పే ఇంట్రడక్షన్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. అమరేంద్ర బాహుబలి సైన్యాధిపతిగా బాధ్యతలు తీసుకొనే సన్నివేశాలు నభూతో నభవిష్యత్‌గా రాజమౌళి చిత్రీకరించాడు. సన్నివేశాలకు ధీటుగా కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అమోఘం అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ప్రేక్షకుడు ఎలా చెప్పాలో తెలియక మాటలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

      సెకండాఫ్‌లో బాహుబలిపై బిజ్జాలదేవ (నాజర్), భళ్లాల దేవ (రానా దగ్గుబాటి) దుష్ఠపన్నాగాలు, చెప్పుడు మాటలతో శివగామి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటి అంశాలను చక్కటి స్క్రీన్ ప్లే తో దర్శకుడు పరుగులు పెట్టించాడు. దేవసేన శ్రీమంతం సీన్ మరో కీలకమైన అంశం. పుట్టబోయే బిడ్డను తొలిసారి తాతయ్యగా నీవు తీసుకొంటావా అని కట్టప్పను దేవసేన అడగడం సెంటిమెంట్‌ బాగా పండించింది. తాను చేసిన పాపాలను శివగామి తెలుసుకొని దేవసేన, బాహుబలి కుమారుడు (మహేంద్ర బాహుబలి)ని మహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించడం సినిమాకు మరో హైలెట్. తన తండ్రి, తల్లికి జరిగిన అన్యాయానికి భళ్లాల దేవపై మహేంద్ర బాహుబలి ప్రతీకారం తీర్చుకోవడం, వారి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. మొత్తంగా బాహుబలి2 కథ ప్రారంభమైన దగ్గరి నుంచి చివరి వరకు ప్రతీ సన్నివేశాన్ని ఆసక్తి కలిగించే విధంగా జక్కన చెక్కిన తీరు అభినందనీయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X