twitter

    విమర్శకుల సమీక్ష

    • వెంకటేష్ పెర్ఫార్మెన్స్, నయనతార అందం ఈ సినిమా హైలెట్. పోలీసాఫీర్ పాత్రలో వెంకీ లుక్స్ సూపర్బ్. నయనతార తన అందంతో పాటు, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఓ వైపు కామెడీ పండిస్తూనే తనదైన స్టైల్ లో సీరియస్ గా సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ అవ్వడం ఆకట్టుకుంటుంది. కామెడీ విషయానికొస్తే ఫస్టాఫ్ లో బత్తాయికాల బాబ్జీ పాత్రలో పృథ్వి మరోసారి తనదైన మేనరిజంతో అదరగొట్టాడు. వెంన్నెల కిషోర్ ఓకే. సెకండాఫ్ లో బ్రహ్మానందం కాసేపు ఎంట్రీ ఇచ్చినా పెద్దగా నవ్వులు పండలేదు. కామెడీ విలన్ పాత్రలో పోసాని కృష్ణ మురళి మరోసారి తనదైన మార్క్ చూపించారు. రౌడీ షీటర్ గా సంపత్ రాజ్, ఫిష్ వెంకట్ తదితరులు ఫర్వాలేద. ఈ సినిమాకు పెద్ద మైనస్ కథే. కొత్తదనం లేక పోవడం, రొటీన్ గా ఉండటంతో పెద్దగా ప్రేక్షకుల్లో ఆసక్తి లేకుండా పోయింది. కనీసం స్క్రీన్ ప్లే తో అయినా దర్శకుడు ప్రేక్షకుడిలో సినిమాపై ఆసక్తి పెంచాడా అంటే అదీ లేదు. ఫస్టాఫ్ వెంకీ స్టైల్ లో నాలుగు కామెడీ సీన్లు, ఫారిన్ లొకేషన్లలో పాటలతో నింపేసాడు కాబట్టి ప్రేక్షకులు కాస్త ఎంజాయ్ చేసారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి సాగదీసినట్లు ఉండే కథనం, బోరింగ్ సీన్లతో ప్రక్షకుల మూడ్ చేంజ్ అయింది. సినిమా ఇంకా ఎప్పుడు అయిపోతుందనే ఫిలింగ్ కలిగించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X