twitter

    భలే భలే మగాడివోయి స్టోరి

    భలే భలే మగాడివోయి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, లావణ్య్, మురళి శర్మ, సితారా, వెన్నెల కిశోర్, భద్రమ్, అజై, ప్రవీణ్, సితార, నరేష్, ప్రభు శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి నిర్వహించారు మరియు నిర్మాత బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    లక్కి(నాని) కు చిన్నప్పటినుంచీ వీర మతిమరుపు. దాన్నే కంటిన్యూ చేస్తూ పెద్దయ్యాక కూడా మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదుగుతాడు. దాంతో అతనికి పెళ్లి సైతం ఓ సమస్యగా మారుతుంది. ఈ నేపధ్యంలో అతనికి ఓ సైంటిష్టు పూర్ణ చంద్రరావు (మురళి శర్మ) కుమార్తెతో ఓ సంభంధం చూస్తారు. అయితే నాని..ఆయన్ను తన మతిమరుపుతో ఇబ్బందిపెడతాడు. దాంతో నానికి తన కూతురుని ఎట్టి పరిస్దితుల్లో ఇచ్చేది లేదని తెగేసి చెప్పేస్తాడు. తర్వాత నాని ఓ రోజు నందిన(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఈ లవ్ జర్నిలో ..తన మతిమరుపుతో కొన్నిసార్లు నాని ఆమె దగ్గర దొరికిపోయే సమయంలో తన సమయస్పూర్తితో అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి బయిటపడుతూంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్...నందిన మరెవరో కాదు తనని ఇష్టపడకుండా రిజెక్టు చేసిన సైంటిస్టు కుమార్తే. ఈ విషయం తెలిసిన నాని ఎలా కవర్ చేసి, ఆమెను దక్కించుకున్నాడు..అలాగే ఈ చిత్రంలో అజయ్ పాత్ర ఏమిటి..నానికి ప్రేమకు ఎలా అడ్డుపడ్డాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
    **Note:Hey! Would you like to share the story of the movie భలే భలే మగాడివోయి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X