twitter
    TelugubredcrumbMoviesbredcrumbCheliyabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • చెలియా చిత్రం కథ యుద్ద పోరాటంతో ప్రారంభమవుతుంది. యుద్ధంలో పాకిస్థాన్ అధికారులకు బందీగా చిక్కిన వరుణ్ జైలు జీవితాన్ని అనుభవిస్తూ తన ప్రేయసి ఊహాల్లో గడుతుంటాడు. అదే సమయంలో జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే ఆలోచనతో సినిమా నడుస్తుంటుంది. రెండు కోణాల్లో కథ నడుస్తూ ప్రథమార్థం ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. ఒక టిపికల్ ప్రవర్తన కలిగిన వరణ్ ప్రేమ కోసం లీలా వెంటపడటం వంటి అంశాలతో కథ ఆసక్తి సాగుతుంది. ప్రథమార్థంలో వరుణ్ అన్నయ్య పెళ్లి ఎపిసోడ్ కూడా ఫీల్ గుడ్‌ భావన కలిగిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకోవడంతో సినిమా రెండో భాగంపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. వరుణ్, లీలా ప్రేమ కథను సాగతీయడంతో రెండో భాగంలో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అనే భావన ప్రేక్షకుడి కలుగుతుంది. సెకండాఫ్‌లో సన్నివేశాలు కూడా అంతగా ఆసక్తి లేకపోవడం కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. తప్పించుకొనే క్రమంలో పాకిస్థాన్ అధికారులకు వరుణ్ బృందం మళ్లీ పట్టుబడటంతో ఇక క్లైమాక్స్‌ భారీగానే ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎలాంటి భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం.. కథ రొటీన్‌గా సాగిపోవడంతో చివరకు ఇది రోజా, బొంబాయి తరహా చిత్రం కాదని తేలిపోతుంది. మణిరత్నం నుంచి వచ్చిన సాదాసీదా ప్రేమకథ అని ప్రేక్షకుడికి అర్థమైపోతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X