twitter

    విమర్శకుల సమీక్ష

    • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అగ్రి గోల్డ్ కుంభకోణాన్ని పోలిన నేపథ్యాన్ని అగ్రి డైమండ్ పేరుతో కథను అల్లుకున్నాడు. చాలా సీరియస్ సమస్యకు దర్శకుడు హరీశ్ శంకర్ బ్రహ్మణ నేపథ్యాన్ని జోడించాడు. స్వతహాగా హరీశ్ బ్రహ్మణుడు కావడంతో కథలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, గ్రౌండ్ వర్క్ బాగా చేయడానికి అవకాశం లేకుండా వెసలుబాటు కలిగింది. అల్లు అర్జున్‌లో ఉండే ఎనర్జీని, సానుకూల అంశాలను దృష్టిలో పెట్టుకొని కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంటు ఎక్కువగా మేలవించి, కొంత యాక్షన్ జతచేసి ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. పూజా హెగ్డే గ్లామర్, అల్లు అర్జున్ స్టయిల్‌ను మిక్స్ చేసి ఫస్టాఫ్‌ను పరుగు పెట్టించాడు. ఇక రెండో భాగంలో విలన్‌తో వైరం ప్రధాన అంశంగా మారింది. దీంతో క్లైమాక్స్‌ ఏంటో ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతుంది అయితే కథను ఎలా ముందుకు తీసుకు వెళ్తాడనే ఆసక్తి కరమైన పాయింట్ ప్రేక్షకుడికి ఇంటర్వెల్ కలిగుతుంది. క్లైమాక్స్‌ను చేరుకోవడానికి దర్శకుడు అనుసరించిన పద్ధతి, కమర్షియల్ ఎలిమెంట్లను వాడుకొన్న విధానం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. కొత్తగా చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రొటీన్ భిన్నంగా క్లైమాక్స్‌ను కామెడీతో ముగించడంతో ప్రేక్షకుడు నవ్వుతూ ఓ సంతృప్తితో బయటకు వచ్చే అవకాశాన్ని కల్పించాడు. అయితే ఫైట్స్, భారీ హంగామా లాంటి రెగ్యులర్ క్లైమాక్స్‌ను కోరుకొనే సాధారణ ప్రేక్షకుడికి కొంత ఇబ్బందే ఉంటుంది. జులాయి, రేసుగుర్రం, అదుర్స్ లాంటి ఛాయలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X