twitter
    TelugubredcrumbMoviesbredcrumbJakkannabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సునీల్ ఈజ్ బ్యాక్ టు ఎంటర్టైన్...అని టీజర్ లో పబ్లిసిటీ చేసారు. ఓహో..సునీల్ తిరిగి..తన పాత రోజుల్లోకి వెళ్లికామెడీ చెయ్యాలనుకుని నిర్ణయించుకుని వచ్చాడనుకుంటే...పూర్తి నిరాశపరుస్తాడు. సునీల్ కు మనస్సులో మాస్ సినిమా చెయ్యాలని ఉన్నట్లుంది. కానీ కామెడీ చేస్తూంటాడు. దాంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారౌతున్నాయి. అందాల రాముడులో ఎలా కనిపించాడో, పూల రంగడులోనూ అదే ఎక్సప్రెషన్స్ తో కనిపించాడు. ఇప్పుడు జక్కన్నలోనూ అలాగే కామెడీ చేద్దామనుకున్నాడు...కాని కామెడీ పండాలంటే పంచ్ లు,ప్రాసలు దండిగా ఉండాలని డైరక్టర్, హీరో ఫిక్సైనట్లున్నారు. అలాగే సినిమా మొత్తం నింపేసారు. అయితే ఆ ప్రాసలు, పంచ్ లు నవ్వించలేదు సరికదా విసిగించాయి...అందులో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెడీ బాగుంది. సెకండాఫ్‌లో పోలీసాఫీసర్ కట్టప్ప పాత్రలో పృథ్వీ, నందమూరి నటసింహం బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ అంతా పోన్లే సెకండాఫ్ లో ఏదో అద్బుతం జరుగుతుందని భరిస్తే..అదీ మరీ దారుణం అయ్యిపోయింది. అయోమయంగా, కంగాళిగా మారిపోయింది. ఈ కథలో ప్రధాన సమస్య హీరో క్యారక్టరైజేషన్ లో ప్లెక్సివేషన్స్. అతను ఫైట్స్ అప్పుడు సీరియస్ గా , ప్రేమిస్తున్నప్పుడు ఒకలా..కామెడీ చేసేటప్పుడు మరొకలా ఉండటం. దానికితోడు ప్రెడిక్టుబల్ కథనం కూడా సినిమాని నీరు కార్చింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X