twitter

    జయమ్ము నిశ్చయమ్ము రా స్టోరి

    జయమ్ము నిశ్చయమ్ము రా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస రెడ్డి, పూర్ణ, కృష్ణ భగవాన్, శ్రీ విష్ణు, పోసాని కృష్ణ మురళి, రవి వర్మ, జీవా, తాగుబోతు రమేష్, జబర్దస్థ్ సన్ని, దబ్బింగ్ జానకి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ రామ రాజు కనుమూరి నిర్వహించారు మరియు నిర్మాత సతీష్ కనుమూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వి రవిచంద్ర స్వరాలు సమకుర్చరు. 

    కథ

    ఈ సినిమా కథ 2013లో ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు జరిగింది. తెలంగాణ ప్రాంతం కరీంనగర్‌జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సర్వమంగళం అలియాస్ సర్వేశ్ కుమార్ ( శ్రీనివాస్‌రెడ్డి) చుట్టూ తిరుగుతుంది. సర్వమంగళం...గత పదేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తూ ఎలాంటి ఫలితం రాకపోవడంతో నిరుద్యోగిగా తిరుగుతుంటాడు. అతను తెలివైన కుర్రాడే.... కానీ.. అతనిలో ఆత్మన్యూనతా భావం ఎక్కువ. అందుకే తనలోని శక్తి సామర్థ్యాల్ని వదిలేసి.. అమాయకంగా అంధ విశ్వాసాల్ని నమ్ముతుంటాడు. సర్వమంగళం... ప్రతి విషయానికీ బాబా పిత (జీవా) చెప్పే జోస్యానికి విలువనిస్తూ ఆయన మీద ఆధారపడుతుంటాడు. ఆయనేం చెబితే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంటాడు .ఆ బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ స్వామీజీ (జీవా) పేరు మార్చుకుని, ఒక రాత్రి స్మశానంలో పడుకుంటే ఉద్యోగం వస్తుందని సర్వమంగళానికి త్వరలో ఉద్యోగం వస్తుందని చెబుతాడు. పిత చెప్పిన జాతకం ప్రకారమే తన పేరును సర్వమంగళంగా మార్చుకొంటాడు. అలాగే స్మశానంలో ఓ రాత్రంతా పడుకుంటాడు. అలా స్వామీజీ చెప్పిన ప్రకారమే చేసిన సర్వమంగళానికి...ఆంధ్ర ప్రాంతంలోని కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో గుమస్తాగా పోస్టింగ్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగమే కలగా భావించే సర్వ మంగళానికి స్వామీజీ చెప్పినట్లే .. కాకినాడ మున్సిపాలిటీలో ఉద్యోగం రావటంతో... ఆ తర్వాత కూడా పిత చెప్పే జాతకాలపైనే ఆధారపడుతుంటాడు. అయితే అంత దూరం రావడానికి తల్లి ఇష్టపడకపోవడంతో చేసేదిలేక ఒంటరిగా కాకినాడకు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాడు సర్వేశ్. అమ్మ కోసం బదిలీపై సొంతూరు కరీంనగర్‌ వెళ్లాలన్నది అతని కోరిక. దాంతో ఉద్యోగంలో చేరిన రోజునుండే ఎలాగైనా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని తన తల్లి దగ్గరికి కరీంనగర్‌కు వెళ్ళిపోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. అదే సమయంలో ఉద్యోగం వచ్చే ముందు కరీంనగర్‌లో చూసిన అమ్మాయి రాణి (పూర్ణ) ని మళ్ళీ కాకినాడలో చూస్తాడు. అదీ తన ఆఫీసు పక్కనే ఉన్న మీ సేవాలో పనిచేయడం చూసి తనతో ప్రేమలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎదురుపడిన రాణి (పూర్ణ) జీవితంలోకి వస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని పిత చెబుతాడు. దాంతో రాణిని ప్రేమించడం మొదలుపెడతాడు సర్వమంగళం. తనకు అద‌ష్టంగా కలిసొచ్చిన ఆ అమ్మాయి పేరు రాణి అని తెలుసుకున్న సర్వేశ్‌ అక్కడే బ్రోకర్‌లా పనిచేసే తత్కాల్ ( ప్రవీణ్) సహాయంతో ఆ అమ్మాయి వివరాలన్నీ కనుక్కుని ప్రొసీడ్ అవుతూంటాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తన బాస్ ద్వారా త్వరగా ట్రాన్ఫర్ చేయించుకుని సొంత ఊరికి వెళ్లిపోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ పని మీదే ఉంటాడు. ఈ క్ర‌మంలోనే రాణి న‌ర్స‌రీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫైల్ మ‌నోడి వ‌ద్ద‌కే వ‌స్తుంది. అప్ప‌టి నుంచి ఆమెకు ద‌గ్గ‌ర‌య్యేందుకు ర‌క‌ర‌కాల ప్లాన్లు వేస్తుంటాడు. అక్క‌డ స‌ర్వ‌మంగ‌ళం పై అధికారి జే.సి(రవివర్మ) స్త్రీ లోలుడు. అందుకోసం అతను సర్వమంగళం ఉంటోన్న ఇంటినే వాడుతుంటాడు. అలాగే సూపరిండెంట్ అడపా అప్పారావు ( క‌ృష్ణ భగవాన్) కూడా తన అవసరాల కోసం వాడుకుంటూంటారు. అది చూసి ఏం చేయలేకపోతాడు. కానీ తల్లి కోసం తప్పదు భరిస్తాడు. ఇదిలా ఉంటే...ఓ రోజు రాణి తనపై ఆఫీసర్ జేసితో కలిసి తన రూమ్ కు వస్తుంది. జేసీతో రాణిని చూసిన సర్వమంగళం ఏం చేశాడు ? రాణి నిజంగానే తప్పు చేసిందా.. ? అతను మంచివాడు కాదనే విషయం సర్వమంగళంకి తెలుసు. మరి అతని వలలో రాణి పడకుండా ఏం చేశాడు? ఇంతకీ రాణిని ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? అనేది చూసి తెలుసుకోవాలి. సర్వమంగళం జాతకాల పిచ్చిని వదిలి పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? ఆత్మవిశ్వాసంతో అడుగులేశాక అతని చుట్టూ వాతావారణం ఎలా మారింది? కరీంనగర్‌కి ఎలా బదిలీ అయ్యాడు? లాంటి విషయాల్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    **Note:Hey! Would you like to share the story of the movie జయమ్ము నిశ్చయమ్ము రా with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X