twitter
    TelugubredcrumbMoviesbredcrumbKaadhalibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • కాదలి చిత్రం చాలా రెగ్యులర్ స్టోరీనే. ఇద్దరు స్నేహితుల ప్రేమ మధ్య నలిగిన ఓ అమ్మాయి ప్రేమ కథ. పెళ్లి చూపులు బెడిసి కొట్టిన ఓ అమ్మాయి తన నాన్నమ సలహా మేరకు తనకు నచ్చిన వరుడిని వెతుక్కునే సింగిల్ లైన్ కథను దర్శకుడు పట్టాభి సాగదీసి సాగదీసి చెప్పాడు. అయితే గతంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రేమకథ ప్రభావంతో దర్శకుడు కథ రాసుకొన్న విధానం బాగానే ఉంది. కానీ ఆయన ఎంచుకొన్న నటీనటుల ఎంపికే సరిగా లేదు. పెళ్లిచూపులు మాదిరిగా పేరులేని నటీనటులతో హిట్ కొడుదామనే ప్రయత్నం పట్టాభిలో కనిపిస్తుంది. ప్రతీ రోజు పండుగ కాదు అన్నట్టే.. తీసిన ప్రతీ సినిమా పెళ్లి చూపులు కాదు గదా. పెళ్లి చూపుల్లో ఇద్దరి మధ్య సంఘర్షణ ఉంటుంది. ప్రేమలో ఉద్వేగం, ఫీల్ ఉంటుంది. అందుకే పెళ్లి చూపులు చిత్రాన్ని తెరమీద చూడగానే ప్రేక్షకుడు కూడా లీనమైపోయాడు. కానీ కాదలి చిత్రంలో అలాంటి అంశాలు కనిపించవు. రెండో భాగానికి క్లిష్టమైన సమస్యను చూపించకుండానే ఇంటర్వెల్ కార్డు వేసేశాడు దర్శకుడు. రెండో భాగంలో ప్రేమికుల మధ్య సంఘర్షణను గొప్పగా చూపించాడా అంటే అదీ ఉండదు. పేలవమైన సీన్లు, నాసిరకమైన యాక్షన్ సీన్లు, ఆకట్టుకొని కథనం, హాస్యం ఇలాంటి అంశాలను కాదలిని సాదాసీదాగా మార్చేసాయి. రెండో భాగం ప్రారంభం కాగానే క్లైమాక్స్‌లో ఏమవుతుందో అనే విషయం సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమవుతుంది. దాంతో ఇక ఎండ్ టైటిల్ కార్డు ఎప్పుడు పడుతుందా అని వేచిచూడటం ప్రేక్షకుడి వంతుగా మారుతుంది. చివరకు ఇది సినిమాల కాకుండా షార్ట్ ఫిలిం చూసిన ఫిలింగ్ కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X