కంచె (2015)(U/A)
Release date
22 Oct 2015
genre
కంచె స్టోరి
కంచె సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, ప్రఘ్య జైస్వాల్, నికితిన్ దీర్, శ్రీనివాస్ అవసరాల, షావుకారు జానకి, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అనూప్ పూరి, మెరీనా టారా తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా క్రిష్ణా జగర్లమూడి (క్రిష్) నిర్వహించారు మరియు నిర్మాతలు వై రాజీవ్ రెడ్డి, సాయి బాబు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చిరంతన్ భట్ట్ స్వరాలు సమకుర్చారు.
కథ
ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ) రెండో ప్రపంచ యుద్దం(1944)లో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడే ఓ సైనికుడు. అతని కమాండర్ ఈశ్వర్ (నిక్తిన్ ధీర్). ఓ సమయంలో జర్మన్ ఆర్మీ దాడి జరిపి..ఈశ్వర్ ని అతనితో పాటు ఉన్న వారిని ఎత్తుకుపోతారు. అయితే హరిబాబుకు , కమాండర్ ఈశ్వర్ కు ఇంతకు ముందే(1936) పరిచయం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...రాచకొండ సంస్దానాధినేత ఈశ్వర్ కు ఓ చెల్లెలు సీతాదేవి(ప్రగ్యాజైస్వాల్). సీతాదేవి, హరిబాబు ప్రేమించుకుంటారు. అయితే హరిబాబుది నిమ్న కులం కావటంతో ఊళ్లో గొడవలు భగ్గుమంటాయి. వారి ప్రేమ ప్రక్కన పెడితే ఇప్పుడు హరిబాబు... తన కమాండర్ ని,మిగతా వారిని రక్షించాడా..లేక గతం గుర్తు పెట్టుకుని వదిలాసాడా....సీతాదేవితో హరిబాబు ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా సినిమా.
**Note:Hey! Would you like to share the story of the movie కంచె with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు