twitter

    విమర్శకుల సమీక్ష

    • ఎలాంటి సాగతీత లేకుండా మొదటి సీన్‌లోనే అన్నదమ్ముల అనుబంధం, కాటమరాయుడు ఎంటో చక్కగా చెప్పేశాడు. మరో సీన్లో రావు రమేశ్‌కు ఉన్న శత్రుత్వాన్ని సింపుల్ చెప్పేసే కథపై పట్టు సాధించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో కాటమరాయుడు సోదరులు, ఆలీ ప్రేమ వ్యవహారాన్ని డైరెక్టర్ చకచకా నడిపించేశాడు. అవంతి (శ్రుతిహాసన్) ఎంట్రీ చాలా సాఫీ జరిగిపోయింది. కాటమరాయుడు, అవంతి ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా సాగిపోతాయి. కాటమరాయుడు టైటిల్ సాంగ్, జివ్వు జివ్వు, లాగే లాగే పాటలు, రెండు మంచి ఫైట్లతో ఫస్టాఫ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఇక సెకండాఫ్‌లోనే దర్శకుడు తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంది. అవంతి ప్రేమ కోసం కాటమరాయుడు తన ప్రవర్తనను మార్చుకోవడం లాంటి సీన్లు రొటీన్‌గా ఉండటంతో సినిమా పట్టుతప్పినట్టు కనిపిస్తుంది. కేవలం క్లైమాక్స్ కోసమే కథను ముందుకు తీసుకెళ్లడం, కథనం మందగించడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ప్రీ కైమాక్స్ నుంచి కథ కొంచెం అందుకోవడంతో కాస్తా రిలీఫ్ అనిపిస్తుంది. చివరి సన్నివేశంలో కాటమరాయుడు నాలుగు మంచి మాటలతో విసిగిపోయిన ప్రేక్షకుడికి కొంత ఉపశమనం కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X