twitter
    TelugubredcrumbMoviesbredcrumbKeshavabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • స్వామి రారా, దోచెయ్ లాంటి సినిమాలు దర్శకుడు సుధీర్ వర్మ ప్రతిభకు అద్దం పట్టాయి. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న కేశవ్ చిత్రం కూడా విభిన్నంగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ప్రేక్షకులు అంచనాలకు భిన్నంగా రొటీన్ కథ, కథనాలతో కేశవ్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అందుకు నిఖిల్‌ రూపు రేఖలను, బాడీ లాగ్వేజి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఆరంభంలో ఏదో వైవిధ్యమున్న సినిమానే చూడబోతున్నామనే ఫీలింగ్‌ను కల్పించాడు. కానీ సన్నివేశాలు, డైలాగ్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. మర్డర్ మిస్టరీ అంటే తర్వాత సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఇంట్రస్ట్ క్రియేట్ కావాలి. సినిమాలోని సన్నివేశాలను చాలా సులభంగా ఊహించే విధంగా ఉంటాయి. కథలో దమ్ము లేకపోవడం ఈ సినిమాకు మొదటి మైనస్ పాయింట్. ప్రతిభావంతులైన దర్శకులకు కథ అక్కర్లేదని కొందరు డైరెక్టర్లను చూస్తే అర్థమవుతుంది. సులభమైన కథను చాలా ఎమోషన్‌లా, పక్కాగా చెప్పినప్పుడే ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు. ట్విస్టులు, చమక్కులు ప్రేక్షకుడిని మైమరిపించే విధంగా చేస్తాయి. స్వామి రారా విషయంలో ప్రేక్షకుడి ఫీలయైన విషయం అదే. అందుకే ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేని సినిమాను బాగా ఆదరించారు. కేశవ్ చిత్రం దానికి పూర్తిగా వ్యతిరేకమైంది. కథలో లోటుపాట్లు ఉన్నా కథనంపైనా దృష్టిపెట్టి ఉంటే కొంతలో కొంతనైనా ప్రేక్షకుడికి సంతృప్తి మిగిలి ఉండేది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X