twitter

    విమర్శకుల సమీక్ష

    • ఓ పక్క ప్రేమ, మరోపక్క చకచకా సాగే మాస్‌ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. చిరంజీవి ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటారు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే ‘రత్తాలూ...'. ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు కుర్రకారుని హుషారెక్కిస్తాయి. లుక్‌ పరంగా చిరంజీవి... ఒకప్పటిలానే కనిపించి ‘ఆహా పదేళ్ల తరవాత కూడా అదే ఫిజిక్‌తో కనిపిస్తున్నారే' అని ఆశ్చర్యపోయేలా చేస్తారు. డ్యాన్సుల పరంగానూ ఒకప్పటి స్పీడే ఇప్పుడూ కనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయిన ఈ చిత్రం సెకండాఫ్ కు వచ్చేసరికి కాస్తంతం నెమ్మిదించిందనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ రొటీన్ గా ఉండి, లెంగ్తీగా ఉన్న ఫీల్ వచ్చింది. అఫ్ కోర్స్ నిజానికి సెంకడాఫ్ లోనే వాస్తవానికి కథలోకి వచ్చారు. కానీ సామాజిక సమస్య చుట్టూ అల్లిన కథనం కావటంతో కాస్త డ్రైగా నిపించింది. ఫస్టాఫ్ లాగే సెకండాఫ్ ఉంటే సినిమా భాక్స్ లు బ్రద్దలయ్యేవనటంలో సందేహం లేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X