మామ మంచు అల్లుడు కంచు (2015)(U/A)
Release date
25 Dec 2015
genre
మామ మంచు అల్లుడు కంచు స్టోరి
మామ మంచు అల్లుడు కంచు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ బాబు, అల్లరి నరేష్, రమ్య కృష్ణ, మీనా, పూర్ణ, వరున్ సందేష్, అలీ, కృష్ణ భగవాన్, జీవా, రాజా రవింద్ర, సోనియా, సురేఖా వాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు అచ్చు, రఘు కుంచే కలిసి స్వరాలు సమకుర్చారు.
కథ
భక్తవత్సలం నాయుడు( మోహన్ బాబు) అనుకోని పరిస్థితుల్లో రెండు పెళ్ళిలు చేసుకొని పాతికేళ్లుగా ఒకరి తెలియకుండా ఒకరిని మెయిన్టెయిన్ చేయడానికి కష్టపడిపోతుంటాడు. అతని స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఈ కష్టాల్లో నాయుడుగారికి సాయం చేస్తుంటాడు. భక్తవత్సలం నాయుడు మొదటి భార్య సూర్యకాంతం (మీనా) కి ఒక కూతురు శృతి(పూర్ణ), రెండో భార్య ప్రియంవద(రమ్యకృష్ణ)కు ఓ కొడుకు గౌతమ్ నాయుడు(వరుణ్ సందేశ్). ఇలా కష్టాల్లో సాగుతున్న భక్తవత్సలం నాయుడుకి పిల్లలు పెళ్లీడుకి రావటంతో కొత్త కష్టాలు మొదలవుతాయి. శృతి, గౌతమ్ల పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావటంతో సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది.
**Note:Hey! Would you like to share the story of the movie మామ మంచు అల్లుడు కంచు with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు