twitter

    విమర్శకుల సమీక్ష

    • రఘు నందన్ పాత్రలో ఆది తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే సినిమాలో తనను తాను నిరూపించుకునేంత అడ్వంచర్స్, థ్రిల్లింగ్ సీన్లు ఏమీ లేవు. హీరోయిన్ నిక్కి గల్‌రాణి ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి తీసుకున్నట్లే ఉంది తప్ప..... ఆమెకు రెండు మూడు మినహా పెద్దగా సీన్లు అయితే పడలేదు. ఆ మధ్య ఐదు పాటలతో కూడిన ఆడియో విడుదల చేశారు. అయితే థియేటర్లో మాత్రం డ్యూయెట్ సాంగులు లేవు. పాటలను కట్ చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది. అసలు హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా లేదు. అయితే నిక్కి గాల్ రాణి పాత్రకు మగ గొంతుతో ఉత్తేజ్ చెప్పిన డబ్బింగ్ మాత్రం కాస్త నవ్వు తెప్పిస్తుంది.

      మణి కోసం వెతికే ఓ సింపుల్ స్టోరీ ఎంచుకున్నపుడు కామెడీ ట్రాక్, సస్పెన్స్, థ్రిల్లింగ్ లాంటి అంశాలతో స్క్రీన్ ప్లే పక్కగా రాసుకోవాలి. అప్పుడే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ప్రతి సీనూ ఇంట్రస్టుగా ఉంటుంది. అయితే ‘మరకతమణి' స్క్రీన్ ప్లే చాలా స్లోగా.... నీరసంగా సాగినట్లు ఉంది. అక్కడక్కడా కాస్త కామెడీ సీన్లు పడ్డాయి కాబట్టి ఫర్వాలేదు కానీ, లేకుంటే సినిమాను భరించడం చాలా కష్టమే. ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా కీలకం. నిధి, మణి లాంటి కాన్సెప్పులు ఎంచుకున్నపుడు ప్రేక్షకలు ఉత్కంఠకు గురయ్యేలా క్లైమాక్స్ ఉంటే మరింత అదిరిపోయేది. అయితే ‘మరకతమణి' క్లైమాక్స్ ఏమంత పెద్దగా ఆకట్టుకోలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే.... ‘మరకతమణి' ఓ యావరేజ్ ఎంటర్టెనర్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X