twitter

    మోసగాళ్ళకు మోసగాడు స్టోరి

    మోసగాళ్ళకు మోసగాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుదీర్ బాబు, నందిని రాయి, అబిమన్య సింగ్, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఎన్ బోస్ నిర్వహిస్తున్నారు. మరియు నిర్మాత చక్రి చిరుగుపతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణికాంత్ కాద్రి స్వరాలు సమకుర్చుతున్నారు.

    కథ

    క్రిష్(సుధీర్ బాబు) ఓ చిన్న దొంగ (ఇదోదో టైటిల్ అనుకునేరు...అలాంటిదేమీ కాదు..చిన్న దొంగతనాలు,మోసాలు గట్రా చేస్తూంటాడు అని). రెగ్యులర్ గానే మంచి పిల్ల అయిన జానికి(నందిని)తో అతను ప్రేమలో పడటం, ఆమెకు ఈ దొంగతనాలు అవీ నచ్చకపోవటం జరుగుతుంది. అంతేకాదు..ఈ మోసాలు,దొంగతనాలు మానేయమని ఆమె సలహా ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి కోసం తన వృత్తికి స్వస్ది చెప్దామనుకున్న మన హీరోకు...ఓ డీల్ వస్తుంది. డాన్ కౌసిక్(జయప్రకాష్ రెడ్డి) ఓ విగ్రహాన్ని ఎత్తుకురమ్మని పురమాయిస్తాడు. ఆ విగ్రహం చూసాక, దాన్ని ఎత్తుకు పారిపోతూంటే...అది ఓ జంట విగ్రహాల సముదాయం అని...రెండోది ఉంటేనే వాల్యూ అని తెలుస్తుంది. ఆ రెండో విగ్రహం కోసం... డాన్ రుద్ర (అభిమన్యు సింగ్) దగ్గరకు వెళ్తాడు. అక్కడ నుంచి రుద్రని ఎలా బోల్తా కొట్టించి ఆ రెండో విగ్రహాన్ని లేపేసి, బయిటపడ్డాడు... ఇంతకీ ఆ జంట విగ్రహాల కహానీ ఏంటి...తన లవర్ కు ఇచ్చిన మాటకు ఎందుకు కట్టుబడలేదు..లాంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి లేదా తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే. లేదా సినిమా పూర్తి గా చూసినవాడని కలిసి అడగాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie మోసగాళ్ళకు మోసగాడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X