ముకుంద (2014)
Release date
24 Dec 2014
genre
ముకుంద స్టోరి
ముకుంద చిత్రం ఒక యాక్షన్ రోమ్యాంటిక్ సినిమా ఇందులో వరుణ్ తేజ్, పూజ హెగ్దే, ముఖ్య పాత్రాలలో నటించారు. దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల నిర్వహించారు, నిర్మత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి నిర్మించారు . ఈ సినిమా కు సంగీతదర్శకడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమాకుర్చారు.
కథ
కాకినాడ పట్టణంలో స్నేహితులే ప్రాణంగా తిరిగే ముకుందా(వరుణ్ తేజ్)కి బెస్ట్ ప్రెండ్ అర్జున్. అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మున్సిపల్ ఛైర్మన్ సుబ్రమణ్యం(రావు రమేష్)పెద్ద కుమార్తె. అన్ని సినిమాల్లో లాగానే హీరో ఆ ప్రేమకు సహకరిస్తూ అడ్డు వచ్చిన వాళ్లను అడ్డంగా కొడ్తూంటాడు. పనిలో పనిగా 'పరుగు' సినిమా చూసినట్లు... ఆయన రెండో కుమార్తె పూజ(పూజ హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇది సుబ్రమమ్యాణికి బాగా కాలుతుంది. ఈ లోగా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. సుబ్రమణ్యాన్ని దెబ్బ కొట్టడానికి ముకుందా... ఆయనకు పోటీగా ఆ ఊళ్లో చదువుకుని ప్రస్టేషన్ తో తిరిగే ప్రకాష్ రాజ్ ని పోటీకి నిలబెడతాడు...ప్రచారం చేస్తాడు. ఆ పరిస్దితుల్లో మిగతా కథ ఏమౌతుంది అనే డౌట్ ఇప్పటికీ ఉంటే తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie ముకుంద with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు