twitter
    TelugubredcrumbMoviesbredcrumbPataasbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఎప్పుడూ విభిన్న కధాంశాలు,స్క్రీన్ ప్లే లు అంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్ కు అవేమీ కలిసి రాలేదు. అందుకేనేమో...ట్రెండ్ లో ట్రై చేసి హిట్ కొట్టాలనుకున్నాడు...రొటీన్ కథే అయినా కొత్త కామెడీ సీన్స్ తో కథనం పరుగెత్తించి పటాస్ ని అనుకున్న విధంగా భారీగా పేల్చాడు. దర్శకుడు కొత్తవాడైనా తనకున్న కలం బలంతో డైలాగులు పేల్చి స్క్రీన్ పై చెడుగుడు ఆడేసాడు. క్లైమాక్స్ తప్పించి సినిమా మొత్తం ఎక్కడా గ్రాఫ్ క్రిందకి పడకుండా పట్టుకుని కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్, సింగం చిత్రాలు కలిసి వండినట్లున్న ఈ చిత్రం 'గబ్బర్ సింగం' అనిపించుకున్నా కామెడీ తో దాన్ని దాటేసాడు. దాంతో ...ఆ రెండు చిత్రాలులా మంచి విజయం సాధిస్తుంది. అంతేకాదు ఈ రోజు మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు ఎమ్.ఎస్ నారాయణకు ఇది ట్రిబ్యూట్ లా, నివాళిలా ఉంది. చివరి షాట్ సైతం ఎమ్.ఎస్ నారాయణ కామెడీ మీదే ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X