twitter

    ప్రేమమ్ స్టోరి

    ప్రేమమ్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇది మళయాలంలో సూపర్ హిట్టయిన ‘ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసారు...ఇందులో నాగ చైతన్య, శృతి హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చందూ మొండేటి నిర్వహించారు మరియు నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు గోపి సుందర్, రాజేష్ మురుగేషన్ కలసి స్వరాలు సమకుర్చరు. 
     
    కథ

    విక్రమ్‌ అలియాస్‌ విక్కీ (నాగచైతన్య) టీనేజ్‌ లో(16 సంవత్సరాల ) 2000 సంవత్సరం నుంచి ఈ కథ మొదలవుతుంది. మీసాలు కూడా సరిగ్గా రాని ఆ వయస్సులో తన ఫ్రెండ్స్ ని వేసుకుని తన నేటివ్ ప్లేసులో తిరుగుతూ .. సుమ (అనుపమ పరమేశ్వరన్‌) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకొంటాడు. ప్రేమలేఖ కూడా రాస్తాడు. సుమ మాత్రం తాను మరో అబ్బాయిని ప్రేమించానని.. పెళ్లి చేసుకోబోతున్నానని చెబుతుంది. దాంతో మన వాడు హర్ట్. తొలిసారి ఫ్లాఫ్ అయ్యాం కదా అని ఆగుతామా అన్నట్లుగా మరో లవ్ స్టోరీని ఇంజినీరింగ్ కాలేజీలో మొదలెడుతాడు విక్కీ. 2005లో ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు లెక్చరర్‌ సితార (శ్రుతిహాసన్‌)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఆమె కూడా విక్కీని ఇష్టపడుతుంది. కానీ మళ్లీ ట్విస్ట్...ఇక ఆమెతోనే తన జీవితం అనుకున్న విక్కీకి ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. ఆమె కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఓ నిజం తెలిసి విక్కీ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆమెను ఇంటికెళ్లి కలుస్తాడు. ఆ తర్వాత ఆమెపై ఆశలు వదిలేసుకుంటాడు. మరో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత కాస్త జీవితంలో సెటిలై 2016 నాటికి వృత్తిలో స్థిరపడ్డాక విక్కీని సింధు (మడోనా సెబాస్టియన్‌) వచ్చి పరిచయం చేసుకొంటుంది. మొదట ఆమెను గుర్తు పట్టక పోయినా తర్వాత ఆమెను గుర్తు పడతాడు. ఆమెతో విక్కీకి ఉన్న సంబంధం ఏంటి? తన జీవితంలోకి వచ్చిన ఈ అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలనుకొన్న విక్కీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.


    ఇక ఈ సినిమాలో నాగార్జున వాయిస్ ఓవర్ చెప్పటమే కాకుండా ఓ పాత్రను కూడా పోషించాడు. అలాగే వెంకటేష్ సైతం ఓ పాత్రలో వచ్చి దడదడాలించాడు. వీళ్లద్దరి పాత్రలు ఏమిటి, శృతికి ఎదురైన ట్విస్ట్ ఏమిటి, చివరకు విక్కీ లవ్ స్టోరీ ఏ ముగింపుకు వచ్చింది వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు ఖచ్చితంగా వెళ్లి చూడాల్సిందే. 
    **Note:Hey! Would you like to share the story of the movie ప్రేమమ్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X