రేయ్ (2015)(A)
రేయ్ స్టోరి
రేయ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధర్మతేజ్, సాయమి కెర్, శ్రద్దా దాశ్, మరియు తనికెళ్ళ భరణి, బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డి యమ్ యస్ నారాయణ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమా బొమ్మరిల్లు క్రిమేషన్స్ పతాకంపై వై వి ఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు అందించారు.
కథ
రెండు సార్లు అమెరికాలో బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అమెరికన్ పాప్ సింగర్ జెన్న(శ్రద్ధ దాస్) మూడోసారి కూడా ఆ టైటిల్ గెలుచుకోవాలనకుంటుంది. ఇండియా నుంచి వచ్చిన సాండీ(ఫర్హద్ షానవాజ్) ఆమెకు గట్టి పోటీని ఇస్తాడు. దీంతో సాండీని అమెరికన్ డాన్ డాంగే(అర్పిత్ రాంఖా)తో చంపిస్తుంది. అన్నయ్య కోరికను నెరవేర్చి బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవాలని అమెరికా సాండీ చెల్లెలు అమృత(సయామీ ఖేర్) వస్తుంది. ఈ క్రమంలో ఆమెకు రాక్(సాయిధరమ్ తేజ్) పరిచయం అవుతాడు. రాక్‌కు మ్యూజిక్ అన్నా..అమ్మాయిలన్నా చాలా పిచ్చి. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్నను ఎదుర్కోవడానికి వీరిద్దరు ఏం చేసారు? బెస్టాఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకునేందుకు రాక్-అమృత ఏం చేసారు? అనేది తర్వాతి కథ.