సెల్ఫీ రాజా (2016)(U/A)
Release date
15 Jul 2016
genre
సెల్ఫీ రాజా స్టోరి
సెల్ఫీ రాజా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, సాక్షిచౌదరి, కామ్నా రనవత్, నాగినీడు, కృష్ణ భగవాన్, పృద్వి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ఈశ్వర్ రెడ్డి నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత రామబ్రహ్మాం సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
సెల్ఫీరాజా(అల్లరి నరేష్)కు సెల్పీల పిచ్చి, అతను పోలీస్ కమీషనర్ కూతురు శ్వేత(కామ్న రనావత్)ని ప్రేమించి,పెళ్లిచేసుకుంటాడు. ఫస్ట్ నైట్ తమకు వచ్చిన గిప్ట్ లు చూస్తూంటే అందులో ఓ లెటర్, నరేష్ వేరే అమ్మాయితో ఉన్నట్లు ఉన్న కొన్ని ఫొటోలు ఉంటాయి. వీటిని చూసిన భార్య..తట్టుకోలేక.... సెల్పీరాజాను అనుమానించి గొడవ పెట్టుకుని రాజాని వదిలేసి వెళ్లిపోతుంది. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేకుండా తను బ్రతకలేనని గ్రహించిన రాజా ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తాడు. అవేమి సక్సెస్ కాకపోవటంతో సీరియల్ కిల్లర్ (రవిబాబు)కు సుపారి ఇస్తాడు తనను చంపమని. ఈలోగా భార్యకు అవన్నీ వేరేవాళ్లు కావాలని చేసారని, అసలు నిజం తెలిసి తిరిగి వెనక్కి వస్తుంది. కానీ రాజా కు ఆనందం మిగలదు. ఎందుకంటే తను ఒప్పుకున్న పనిని ఎట్టిపరిస్దితుల్లోనూ పూర్తి చేసే కిల్లర్ రవిబాబు అప్పటికే రాజాని చంపటానికి బయిలుదేరిపోయాడు. అంతేకాదు మరికొంత మంది సెల్ఫీ రాజాని చంపాలని తిరుగుతూంటారు. ఆ సిట్యువేషన్ లో సెల్ఫీ రాజా ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎలా కిల్లర్ నుంచి, మిగతావాళ్లనుంచి తప్పించుకుంటాడు... కిల్లర్ కాకుండా సెల్పీరాజా ని ఇంకెవరు చంపాలనుకుంటారు అనేది మిగతా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie సెల్ఫీ రాజా with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు