శ్రీమంతుడు (2015)(U/A)
శ్రీమంతుడు స్టోరి
శ్రీమంతుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, శృతి హసన్, జగపతి బాబు, అమని, రాజేంద్ర ప్రసాద్, నధియా, సంపత్ రాజ్, పూర్ణ, సుగణ్య, రాహుల్ రవింద్రన్, ఆలీ, ముకేష్ రిషి, హరిష్ ఉత్తమన్, సుబ్బరాజు, సనా, తేజశ్వి మదివాడ, సనం శెట్టి, అంగన, శివాజి రాజ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కోరటాల శివ నిర్వహించారు మరియు నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
హర్ష (మహేష్) మల్టిమిలియనీర్ రవికాంత్(జగపతిబాబు)కొడుకు. అయితే అతనో మంచి కుర్రాడు..ఎప్పుడూ ఎదుటి వారికి సాయం చేయాలనుకునే వ్యక్తిత్వం. అతను చారుశీల(శృతిహాసన్) తో ప్రేమలో పడ్డ తర్వాత ఆమె ఓ సీక్రెట్ చెప్తుంది. ఆ సీక్రెట్ అతని తండ్రి గురించి. దాంతో హర్ష ...దేవర కోట గ్రామం వెళ్లి అక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించాలని చూస్తాడు.ఆ గ్రామాన్ని అభివృధ్ది చేయటం మొదలెడతాడు.అక్కడ లోకల్ గా శశి(సంపత్)అనే గూండా ఉండి అడ్డుపడతాడు. అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. ఇంతకీ హర్ష తెలుసుకున్న రహస్యం ఏమిటి...ఇంతకీ గ్రామంలో ఏం చేసాడు...చివరకు హర్ష ఏం సాధించాడు. రాజేంద్రప్రసాద్,ముఖేష్ రుషి పాత్రలు కథలో ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.