twitter
    TelugubredcrumbMoviesbredcrumbTemperbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • వాస్తవానికి క్లైమాక్స్ ట్విస్ట్ మినహాయిస్తే కథలో కొత్తదనమేమీ లేనట్లే. ముఖ్యంగా మొన్నే వచ్చిన పటాస్ సినిమా సైతం సేమ్ టు సేమ్ ఇదే రన్ తో ఉంటుంది. అయితే వాటికీ ఈ సినిమాకు తేడా...పూరి జగన్నాథ్ రాసిన డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్, ఎన్టీఆర్ నటన. కరెప్టెడ్ పోలీస్ అంటే ఇలాగే ఉంటాడు అనేంతగా లీనమై చేసాడు. అలాగే మంచిగా మారినప్పుడు చూపిన ఎమోషన్స్ ...ఎక్సప్రెషన్స్ సైతం ఎన్టీఆర్ లోని నటుడుని పూర్తి స్దాయిలో ఆవిష్కరిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో పూరి జగన్నాథ్ తన రచనా విశ్వరూపం చూపిస్తే..ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపం చూపాడనే చెప్పాలి.

      ముఖ్యంగా...ఎన్టీఆర్ ..కరెప్టెడ్ నుంచి పూర్తిగా మారి పశ్చాత్తాపపడుతున్నప్పుడు పోసాని సెల్యూట్ కొట్టే సీన్, అక్కడ ఎన్టీఆర్ ఎక్సప్రెషన్స్ అద్బుతమనిపిస్తాయి. అంతేకాదు.. క్లైమాక్స్ లో కోర్టులో మన సమాజాన్ని, న్యాయ వ్వవస్దని నిలదీస్తూ డైలాగులు చెప్పేటప్పుడు పెద్ద ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేసాలు కూడా బాగా పేలాయి. డాన్స్ లలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ అదరకొట్టారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ మరీ మరీ చూడాలనిపించేలా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X