twitter

    ఉత్తమ విలన్ స్టోరి

    ఉత్తమ విలన్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, ఆండ్రియా జరెమైహ్, పూజా కుమార్, పార్వతి మీనన్, కె బాలచందర్, కె విశ్వనాథ్, జయరామ్, పర్వథ్య నాయర్, నాజర్, ఎమ్ ఎస్ భాస్కర్, ఉర్వసి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ అరవింద్ నిర్వహించారు మరియు నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గిబ్రాణ్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    మనోరంజన్(కమల్ హాసన్) ఓ పెద్ద స్టార్. అతని కెరీర్ వెనక...మార్గదర్శి (కె.బాలచందర్), తనని స్టార్ ని చేసిన నిర్మాత పూర్ణ చంద్రరావు(కె విశ్వనాధ్) ఉంటారు. మనోరంజన్...ఓ దశలో తను ప్రేమించిన యామినని కాదని, పూర్ణ చంద్రరావు కుమార్తె వరలక్ష్మి(ఊర్వశి)ని వివాహం చేసుకుంటాడు. జీవతం పూలవానలా సాగిపోతున్న సమయంలో ఊహించని విధంగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ అనే విషయం బయిటపడుతుంది. ఎంతో కాలం బ్రతకలేనని తెలుసుకున్న మనోరంజన్..చివరగా తన మార్గదర్శి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని కోరుకుంటాడు. ఆ ఆఖరి చిత్రం చూసినవారు సంతోషంగా బయిటకువెళ్లాలని అడుగుతాడు. అలా తెయ్యమ్ కళ నేపధ్యంలో మృత్యుంజయుడిగా మారిన ఉత్తముడు కథ తెరకెక్కించాలని నిర్ణయించుకుంటారు. సినిమాలో సినిమా మొదలవుతుంది. మరణానికి దగ్గరవుతున్న మనోరంజన్...మృత్యుంజయుడి కథని ఎలా పూర్తి చేసాడు. ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ..అనుభవాలు ఏమిటి..ఇంతకీ ఆ ఉత్తముడు కథేంటి...అనేది తెలుసుకోవాలంటి ఈ చిత్రం చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie ఉత్తమ విలన్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X