twitter

    వంగవీటి స్టోరి

    వంగవీటి (కాపు కాసే శక్తి) సినిమా వంగవీటి మోహన్ రంగా జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు....ఇది ఒక యాక్షన్ క్రైం డ్రామా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్, వంశీ చాగంటి, కౌటిల్య, నైనా గంగూలి, శ్రీతేజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్‌గోపాల్‌ వర్మ నిర్వహిస్తున్నారు మరియు రామదూత క్రిమేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రవి శంకర్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    ఎర్రపార్టీ లీడర్ చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్ గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్ లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ(సందీప్‌కుమార్‌). వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. విజయవాడలో వెంకటరత్నం నీడలో ఎదిగిన ఈ రౌడీ రాధా (సందీప్‌కుమార్‌) ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. అవమానించడంతో రాధ పగతో రగిలిపోతాడు. అదే సమయంలో అనుచరులు రెచ్చగొట్టడంతో రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్ తో దారుణంగా నరికి నరికి చంపుతాడు. వెంకటరత్న మర్డర్ తో... విజయవాడ మొత్తం తన చేతుల్లోకి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఓ లీడర్ వెనుక అనుచరిడిగా ఉన్న రాధ, విజయవాడను శాసించే నాయకుడిగా మారతాడు. తనకు ఎదురొచ్చిన వారందరిని అడ్డుతప్పించుకుంటూ ఎవరూ ఎదిరించలేని స్థాయికి చేరుకుంటాడు. వెంకటరత్నం హత్య జరిగిన సమయంలో కాలేజీలో చదువుకొంటున్న గాంధీ (కౌటిల్య), నెహ్రూ (శ్రీతేజ్‌) సోదరులు రాధాకి దగ్గరవుతారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలుస్తారు. రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలుస్తారు. కాలేజ్ లో తమకంటూ ఓ వర్గం ఉండాలని యునైటెడ్‌ ఇండిపెండెన్స్‌ పేరుతో ఓ యూనియన్‌ స్థాపించాలని సలహా ఇస్తారు. వాళ్ల సూచన మేరకే రాధా యూనియన్‌ని స్థాపిస్తాడు. రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో వెంకటరత్నం .. ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ఆ పార్టీ పెద్దలు రాధ హత్యకు పథకం వేస్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి చంపేస్తారు.  ప్రత్యర్థుల చేతుల్లో రాధా హత్యకి గురవ్వటంతో .... దాంతో అనుచరులంతా రాధా స్థానాన్ని ఆయన తమ్ముడు రంగా (సందీప్‌కుమార్‌)కి కట్టబెడతారు. ఇంతలో స్టూడెంట్‌ యూనియన్‌ నీడలో ఎదుగుతున్న గాంధీ, నెహ్రూలతో రంగాకి విభేదాలు ఏర్పడతాయి. అవి తారస్థాయికి చేరి గాంధీ, నెహ్రూలు కళాశాలలో కొత్త యూనియన్‌ స్థాపించే వరకు వెళతాయి. అప్పటి వరకు అన్నకు అండగా ఉన్న దేవినేని సోదరులతో అభిప్రాయ భేదాలు రావటంతో వారు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించి ఆయన అనుచరులు గాందీని చంపేస్తారు. అన్న గాంధీ హత్యకి ఆయన చిన్న తమ్ముడు మురళి (వంశీ చాగంటి) రగిలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎలా ప్రతీకారం తీర్చుకొవాలనుకుంటాడు. మరో ప్రక్క అప్పటి వరకు రౌడీగా ఉన్న రంగా ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీలో చేరిన నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. నెహ్రు ఎమ్మెల్యే కావటంతో అతని తమ్ముడు మురళీకి పగ తీర్చుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు అందుతాయి. దీంతో గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక్కొక్కరిని మురళి వెతికి వెతికి చంపుతాడు. అంతేకాదు ఏకంగా రంగా.. ఇంటికే ఫోన్ చేసి ఆయన భార్య రత్న కుమారికి వార్నింగ్ ఇస్తాడు. మరోసారి మురళీ వల్ల రంగాకు ప్రమాదం ఉందని భావించి అతన్ని కూడా రంగా అనుచరులు చంపేస్తారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యల కోసం తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తున్న రంగాను నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు దీక్షా వేదిక మీద నరికి చంపేస్తారు. వంగవీటి రంగ మరణంతో రగిలిపోయిన విజయవాడ కొద్ది రోజులకు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం వర్మ కూడా తేల్చలేదు. మిస్టరీగా ప్రేక్షకులకు ప్రశ్నగానే వదిలేశాడు.












    **Note:Hey! Would you like to share the story of the movie వంగవీటి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X