twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘డిజె’ సినిమాను దెబ్బకొట్టేందుకు దుష్ప్రచారం మొదలైంది!

    హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాధమ్’ అఫీషియల్ ట్రైలర్ విడుదలైన తర్వాత.... ఈ సినిమా కాపీ కట్టిన కథతో తెరకెక్కిందంటూ ప్రచారం మొదలైంది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా తయారైంది అంటే..... ఒక హీరో అంటే పడని ఇతర హీరోల అభిమానులు ఆ హీరో సినిమాను దెబ్బకొట్టుందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దాడి చేయడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 'డిజె' సినిమాపై అలాంటి దాడే మొదలైనట్లు బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు.

    హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దువ్వాడ జగన్నాధమ్' అఫీషియల్ ట్రైలర్ విడుదలైన తర్వాత.... ఈ సినిమా కాపీ కట్టిన కథతో తెరకెక్కిందంటూ ప్రచారం మొదలైంది. అదుర్స్, రామయ్యా వస్తావయ్యా సినిమాలను మిక్స్ చేసి ఈ సినిమా తీసారని, ఆ మధ్య తెలుగులో విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ 'బ్రాహ్మణ' చిత్రానికి దగ్గరి పోలికలున్నాయంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.

    కావాలనే చేస్తున్నారా?

    కావాలనే చేస్తున్నారా?

    డిజే మూవీ ఈ నెల 23న విడుదలకు సిద్ధం అవుతుండటంతో.... ఎవరో కావాలనే సినిమాను దెబ్బకొట్టేందుకు ఇలాంటి దుష్ప్రచారం ప్రచారం మొదలు పెట్టారని, వీలైనంత నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడమే వారి ఉద్దేశ్యంలా కనిపిస్తోందని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.

    అంత మాత్రాన కాపీ కొట్టినట్లా?

    అంత మాత్రాన కాపీ కొట్టినట్లా?

    తమ సినిమాలో హీరో బ్రాహ్మిణ్ పాత్ర పోషించిన మాత్రాన... గతంలో వచ్చిన సినిమాలకు కాపీ అని భావించడం మంచిది కాదని, సినిమా విడుదల ముందు ఇలాంటి ప్రచారాలు సినిమాకు నష్టాన్ని కలిగిస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

    అన్ హెల్తీ కాంపిటీషన్

    అన్ హెల్తీ కాంపిటీషన్

    పరిశ్రమలో ఎప్పుడూ హెల్తీ కాంపిటీషనే ఉండాలే తప్ప... మరొకరి సినిమాను దెబ్బకొట్టాలనే ఆలోచనలు మానుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ఒక సినిమా నష్టపోతే ఆ సినిమాపై ఆధారపడ్డ అందరికీ నష్టం జరిగినట్లే ఇలాంటి అన్ హెల్దీ కాంపిటీషన్ పరిశ్రమకు అంత మంచిది కాదని అంటున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి." data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2017/06/07-1496811803-duvvada-jagannadhma-aa-ph-666.jpg">
    డిజే రికార్డ్

    డిజే రికార్డ్

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.</strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Ever since the trailer of Allu Arjun's DJ was unveiled, people have started competing with each other to prove from which film director Harish Shankar has lifted the story. While some say DJ is a mixture of 'Adhurs' and 'Ramayya Vastavayya', some others say the story is directly lifted from Upendra's Kannada film 'Shivam', which was dubbed into Telugu as 'Brahmana'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X