twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ గురించి అతి కొద్ది మందికే తెలిసిన ఈ విషయాలు, మీరు చదివారా?

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్ ...తెలుగు వాడికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనవసరం లేని పేరు. ఆ తారక రాముడు తర్వాత అంతపేరు తెచ్చుకుని తాతపేరే పెట్టుకుని, తాత పేరునే నిలబెడుతూ ముందుకు దూసుకువెళ్తున్నాడు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గా పిలవబడుతూ ఇంకా జూనియర్ ఏంటి..సీనియర్స్ కే చెమటలు పట్టిస్తా అనే రీతిలో వెండితైరపై తన నటనా విశ్వరూపం చూపెడుతున్నాడు.

    తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)

    ఈ నటనా ప్రస్దానం కరెక్ట్ గా పదిహేనేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మొదలైంది. ఆ రోజున ఎన్టీఆర్‌ హీరో గా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' ప్రేక్షకుల ముందుకొచ్చి, ఇదిగో ఆ వారసుడు అంటూ పరిచయం చేసింది.

    :పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్):పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)

    తొలి సినినిమా నుంచీ ఎక్కడా రాజీ పడకుండా నిరతరం కష్టపడుతూ, అంచెలంచెలుగా ఎదిగి బాక్సాఫీసు 'బాద్‌షా'గా మారాడు ఎన్టీఆర్‌. ఆ క్రమంలో తన కెరీర్‌లో ఇటీవలే 25 చిత్రాలు పూర్తి చేసాడు. రాసి కన్నా వాసికే ప్రాద్యాన్యత ఇస్తూ ...అబిమానులను అంచనాలను చాలా సార్లు అందుకుంటూ... మన్ననలు అందుకుంటున్నారు.

    :ఫేస్ బుక్ లో దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ ...రేర్ వీడియో:ఫేస్ బుక్ లో దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ ...రేర్ వీడియో

    ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్‌'తో బిజీగా ఉన్నాడు. హీరో గా పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ గురించి పదిహేను ఆసక్తికరమైన విషయాలు బయిటకు వచ్చాయి. వాటిని మీకు అందిస్తున్నాం.

    రెమ్యునేషన్..

    రెమ్యునేషన్..

    హీరో గా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని'కి ఎన్టీఆర్‌ అందుకొన్న పారితోషికం అక్షరాలా రూ.మూడున్నర లక్షలు. ఆ మొత్తం తల్లి మొత్తం శాలిని చేతుల్లో పెట్టేశాడు.

    పుస్తకాలు చదవరు

    పుస్తకాలు చదవరు

    చాలా మంది ఎన్టీఆర్ ని చూసి, ఆయన డైలాగులు విని పుస్తకాలు తెగ చదువుతారేమో అనుకుంటారు, కానీ ఆయనకు చదవటం కన్నా వినటమే ఇష్టం.

    లక్కి నెంబర్

    లక్కి నెంబర్

    ఎన్టీఆర్ లక్కీనెం.9. ఆయన కారు నెంబర్లలో అన్నీ తొమ్మిదిలే కనిపిస్తాయి. ఈ సారి గమనించండి

    ఇష్టమైన గేమ్

    ఇష్టమైన గేమ్

    ఎన్టీఆర్ మొదటి నుంచీ మంచి క్రికెట్‌ ప్లేయర్‌. బ్యాటింగ్‌ అంటే చాలా ఇష్టం. చిన్న రూము దొరికితే చాలు. అందులోనే ‘వన్‌ టప్‌' క్రికెట్‌ ఆడేస్తారు.

    మంచి కుక్

    మంచి కుక్

    తొలి నుంచి తల్లికు సాయిం చేయటం, ఫ్రెండ్స్ కలిస్తే అందరు కలిసి వంటా,వార్పు చేయటం అలవాటు. వంట చేయడం కూడా ఇష్టం. బిరియానీలు వండి వార్చడంలో దిట్ట.

    ఫేవెరెట్ డిష్

    ఫేవెరెట్ డిష్

    తల్లి శాలిని వండిపెట్టే రొయ్యల బిరియానీ ఫేవరెట్‌ డిష్‌. నెలకోసారైనా తినాల్సిందే

    ఎన్ని వాచీలో

    ఎన్ని వాచీలో

    ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన వారు అక్కడ ఆయన సేకరించిన వాచీలు చూసి షాక్ అవుతారు. అదో హాబి ఆయనకు

    ఎన్ని సార్లు చూసినా

    ఎన్ని సార్లు చూసినా

    ఎన్టీఆర్ కు ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా.. ‘దాన వీర శూర కర్ణ'.

    అదే హాలీవుడ్ లో

    అదే హాలీవుడ్ లో

    ఎన్టీఆర్ కేవలం తెలుగే కాదు, హాలీవుడ్ సినిమాలు బాగానే చూస్తారు. వాటిలో ఎక్కువ సార్లు చూసిన హాలీవుడ్‌ చిత్రం ‘చార్లెస్‌ ఏంజిల్స్‌'. తన పాతిక చిత్రాల్లో ‘నాన్నకు ప్రేమతో' మనసుకు దగ్గరైన సినిమా అట.

    ఫేవెరెట్ హీరో, హీరోయిన్

    ఫేవెరెట్ హీరో, హీరోయిన్

    అభిమాన హీరో... తాతయ్య ఎన్టీఆర్‌. హీరోయిన్ అయితే శ్రీదేవి.

    ఆ పాటంతే తెగ ఇష్టం

    ఆ పాటంతే తెగ ఇష్టం

    ఎన్టీఆర్ కు ..‘మాతృదేవోభవ' చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాటంటే చాలా ఇష్టం. ఆ పాటని కీరవాణి ఎన్టీఆర్‌కి అంకితం ఇచ్చారు కూడా.

    ఆయనే గురువు

    ఆయనే గురువు

    ఎన్టీఆర్‌ ఆధ్యాత్మిక గురువు పేరు జగ్గివాసుదేవ్‌. ఆయన్ని సద్గురు అని పిలుస్తుంటారు.

    గిప్ట్ లు

    గిప్ట్ లు

    ఎన్టీఆర్ కు మొదటి నుంచీ తనతో పనిచేసిన దర్శకులకు చిన్న చిన్న గిప్ట్ లు అందించడం అలవాటు.

    మర్చిపోలేని రోజు..

    మర్చిపోలేని రోజు..

    మార్చి 26... ఎన్టీఆర్‌ మర్చిపోలేని రోజు. 2009 మార్చి 26న ఎన్టీఆర్‌ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన అర్ధాంగి లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు కూడా అదే రోజు.

    తప్పించుకున్నాడు

    తప్పించుకున్నాడు

    ఇటీవల మహేష్‌బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం' కథ ముందుగా ఎన్టీఆర్‌ దగ్గరకే వెళ్లింది. ఈ కథ నచ్చక ఆయన రిజెక్ట్ చేసారు. కానీ మహేష్ ఓకే చేసారు.

    English summary
    NTR completed 15 Years in TFI. So far, He acted in 25 Films and his last release 'Nannaku Prematho' is very close to his heart. Here are 15 Interesting Facts about the Young Tiger...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X