twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఆవిడే నా హీరోయిన్

    By Srikanya
    |

    బెంగళూరు : ఇష్టమైన హీరోయిన్‌ ఎవరని ప్రశ్నించగా.. వాస్తవం చెబితే కష్టం. ఆమెకు వివాహమై భర్త, పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటూ ఉంటుంది. ఆమెను ఎందుకు ఇబ్బందిపెట్టాలి. అందుకే నా భార్యే నా హీరోయిన్‌ అంటున్నాడు ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్. ప్రముఖుల జీవన విశేషాల్ని, అనుభవాల్ని పంచుకునేందుకు కర్ణాటక చలనచిత్ర అకాడమీ నిర్వహిస్తున్న 'బెళ్లిహెజ్జె' 50వ కార్యక్రమం లో భాగంగా హాజరైన ఈ క్రేజీ స్టార్ ఈ విధంగా స్పందించారు.

    అలాగే...పొట్ట బాగా పెరిగింది. సిక్స్‌ప్యాక్‌తో సినిమా తీస్తారా? అని ఓ అభిమాని అడుగగా.. ..అదేం పెద్ద కష్టం కాదు. సిక్స్‌ప్యాక్‌ కాదు ఏకంగా ఎయిట్‌ ప్యాక్‌ అయినా చేయచ్చు. గ్రాఫిక్స్‌ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది అని చెప్పి నవ్వించారు.

    50th Belli Hejje to host V. Ravichandran as guest

    తండ్రి పాత్రల్ని చేస్తున్నారు. దీన్నే కొనసాగిస్తారా? ఆయన స్పందిస్తూ..... వయస్సు మీరిందని అనుకోవద్దు. సుదీప్‌ కోరాడు కాబట్టి తండ్రిపాత్రను అంగీకరించాను. పాతికేళ్ల కింద అడిగినా సంతోషంగా నటించేవాడిని. ఎలాంటి పాత్రల్నైనా చేస్తా. ప్రేమికుడి పాత్రలైనా ఓకే. ఏం చేయాలేనా? అన్నారు.

    రవీంద్ర కళాక్షేత్రలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, సమాచారశాఖ మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు బెళ్లిహెజ్జెలో పాల్గొన్న షాహుకారు జానకి, జయంతి, శ్రీనాథ్‌, ద్వారకీష్‌ తదితర నటీనటుల్ని గౌరవించారు. 50వ బెళ్లిహెజ్జెలో క్రేజీస్టార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని తమ అనుభవాల్ని వివరించారు. సినిమా రంగమే జీవితం.. ఇది తప్ప మరో ప్రపంచం తెలియదని అన్నారు. సిద్ధరామయ్య చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు.

    'అహం ప్రేమోస్మి' సినిమా నిర్మాణ సమయంలో డబ్బు అవసరమైంది. రుణం కోసం కర్ణాటక ఆర్థిక సంస్థ కార్యాలయానికి వెళ్లాను. అక్కడి సిబ్బంది వేచి ఉండాలన్నారు. అదే సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సిద్ధరామయ్య అక్కడికొచ్చారు. నన్ను చూసి ఇక్కడెందుకున్నారని అడిగారు. రుణం కోసం వచ్చానని సమాధానమిచ్చాను. రవిచంద్రన్‌ను వేచి ఉండనిస్తారా.. అంటూ సిబ్బందిపై మండిపడి అప్పటికప్పుడు రుణం మంజూరయ్యేలా చేశారు. ఇలా అనేక సార్లు సిద్ధరామయ్య సాయం చేశారు. ఆయనకు గుర్తుండకపోవచ్చు. అప్పట్లో కృతజ్ఞతలు చెప్పడానికి వీలుకాలేదు. ఇప్పుడు చెబుతున్నాను' అంటూ వివరించారు.

    English summary
    Actor, director, music composer V. Ravichandran, popularly called the ‘Crazy Star’, the guest share his experiences in the Kannada film industry with the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X