twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి గురించి మీకు తెలియని విషయాలు (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 60వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఆయనకు ఫిల్మీబీట్, వన్ ఇండియా పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి సినిమాల్లో బాగా నటిస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్స్ ఇరగదీస్తాడు అనేది అందరికీ తెలిసిందే.

    అయితే ఆయన పర్సనల్ అలవాట్లు, హాబీస్... ఆయన గురించి అభిమానులకు, ప్రేక్షకులకు అంతగా తెలియని విషయాల చాలా ఉన్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాల నుండి ఆయనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు సేకరించాం. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు...

    ఇష్టమైన హీరోయిన్

    ఇష్టమైన హీరోయిన్

    హీరోయిన్‌ శ్రీదేవి. నా దృష్టిలో పర్‌ఫెక్ట్‌ హీరోయిన్‌ అంటే ఆమె. అందంతో పాటుగా వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    ఇష్టమైన పాట

    ఇష్టమైన పాట

    రుద్రవీణలో పాటలు నాకే కాదు... మా ఆవిడ సురేఖకు కూడా చాలా ఇష్టం. ఆ పాటలు వస్తే ఎవ్వరం ఏం మాట్లాడం. వింటూ ఉండిపోతామని చిరంజీవి తెలిపారు.

    అపుడు చేయనివి ఇపుడు

    అపుడు చేయనివి ఇపుడు

    అంతకు ముందు సినిమాలు, రాజకీయాల బిజీలో పడి చేయలేకపోయినవన్నీ గత రెండేళ్ల కాలంలో గ్యాప్ దొరకడంతో చేసినట్లు చిరంజీవి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    చేతి రాత బాగుండదట

    చేతి రాత బాగుండదట

    నా చేతి రాత అస్సలు బావుండదు. ఎంత బావుండదంటే- నేను రాసిన దాన్ని నేనే మళ్లీ చదవలేను. ఇప్పుడు చేతి రాతను మళ్లీ ప్రాక్టీసు చేస్తున్నా.

    అబాకస్, సుడోకు

    అబాకస్, సుడోకు

    అబాకస్‌, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ నేర్చుకుంటున్నట్లు, వీటి ద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    ఫోటో గ్రఫీ హాబీ

    ఫోటో గ్రఫీ హాబీ

    నా హాబీ ఫొటోగ్రఫి. నాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయింది.

    ఫోటో గ్రఫీ గొప్పదనం

    ఫోటో గ్రఫీ గొప్పదనం


    ఒక చిత్రం తీసి దానిని ఇరవై, ముప్ఫై ఏళ్ల తర్వాత మళ్లీ వారికి ఇస్తే కలిగే ఆనందం కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా లభించదని చిరంజీవి అభిప్రాయ పడ్డారు.

    150వ సినిమా గురించి...

    150వ సినిమా గురించి...

    తన 150వ సినిమా సరైన స్క్రిప్టు దొరకక పోవడం వల్లనే ఆలస్యం అవుతోందని చిరంజీవి తెలిపారు. సినిమా సబ్జెక్ట్‌ అందరినీ అలరించే విధంగా, అభిమానులు, ప్రేక్షకులు తన నుండి కోరుకునే అన్ని అంశాలతో ఉండాలన్నారు.

    బడ్జెట్ తక్కువ

    బడ్జెట్ తక్కువ

    ప్రస్తుతం ప్రొడక్షన్‌ ఖర్చు బాగా పెరిగింది. నిర్మాత బాగు కోసం వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. హీరో, హీరోయిన్ల పారితోషికం నుంచి రకరకాల ప్రొడక్షన్‌ ఖర్చుల దాకా అన్నింటినీ పరిశీలించి తక్కువ బడ్జెట్‌తో 150 సినిమా చేస్తానని చిరంజీవి తెలిపారు.

    నచ్చిన దారిలోనే బెరుకు లేకుండా...

    నచ్చిన దారిలోనే బెరుకు లేకుండా...

    ఒక మార్గాన్ని ఎంచుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా, ఆ దారిలో వెళ్లటమే నా విజయానికి ప్రధాన కారణమని చిరంజీవి తెలిపారు.

    అమ్మ, నాన్న గురించి

    అమ్మ, నాన్న గురించి

    నాన్న నాకు హీరో. కానీ అమ్మ దగ్గర చనువెక్కువ. నాకు ఏం కావాలన్నా అమ్మ దగ్గరకు వెళ్లి అడిగేవాడిని. నాన్న అంటే తిడతారనే భయం. కానీ నాన్న తిట్టినప్పుడు కొన్ని లాభాలుండేవి. తిట్టిన ప్రతి సారి- బూట్లు, బట్టలు ఏవో ఒకటి కొనిపెట్టేవారని చిరంజీవి తెలిపారు.

    ఇల్లు వేరే ప్రపంచం

    ఇల్లు వేరే ప్రపంచం

    ఒకప్పుడు సినిమాలు నా వృత్తి. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. నా వ్యక్తిగత జీవితం వేరు. వృత్తి వేరు. ఒక చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో.. ఇంటి గడపలోనే వృత్తికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తా. ఇల్లు వేరే ప్రపంచం. దానిలో ఒత్తిడికి ప్రవేశం లేదు అన్నారు.

    English summary
    Interesting facts about Mega star Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X