twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్సైల్ మ్యాన్ బయో పిక్ ఏమైంది? భారతీయుడు గర్వించే చిత్రం వస్తుందా..? తెలియాలంటే...

    భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత చరిత్రను ప్రజలకు చూపించాలని ఆరాటపడుతున్నారట టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర.

    |

    టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా అనిల్ సుంకరకు గుర్తింపు ఉంది. అంతే కాదు.. తను నమ్మిన కోరిన సబ్జెక్ట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాడంటారు సినిమా జనాలు. ఈయనకు ప్రస్తుతం ఓ బయోపిక్ తీయాలనే ఇంట్రెస్ట్ విపరీతంగా ఉందిట. అది కూడా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత చరిత్రను ప్రజలకు చూపించాలని ఆరాటపడుతున్నారట అనిల్ సుంకర.

    ఏపీజే అబ్దుల్ కలాం అంటే అందరికీ ఆసక్తి మాత్రమే కాదు.. ఎంతో గౌరవం కూడా. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన ఆ మహనీయుని బయోపిక్ అంటే.. ప్రేక్షకాదరణ పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. ఇక్కడ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అన్నదే అత్యంత కీలకమైన విషయం. కలాంపై పుస్తకం రాసి రాజ్ చెంగప్పను ఇప్పటికే స్టోరీ విషయంలో కొన్ని సంప్రదింపులు జరిపారట అనిల్ సుంకర.మన మిస్సైల్ మ్యాన్ తెరమీద కనిపించటానికి జరగ బోయే ప్రయత్నాలపై ఒక లుక్

     డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్:

    డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్:


    కలాంగా ఎవరు నటిస్తారు.. ఎవరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనే అంశాలపై ఇంకా క్లారిటీ లేదు. కానీ దర్శకత్వ బాధ్యతలు టాలీవుడ్ కు చెందిన వ్యక్తికి మాత్రం అప్పగించబోరనే టాక్ నడుస్తోంది. డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి అభిషేక్ అగర్వాల్ కోప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది.

     వచ్చే ఏడాది మార్చిలో:

    వచ్చే ఏడాది మార్చిలో:


    సినిమాకు ‘డా. అబ్దుల్ కలాం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కాగా, షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఈ చిత్రం అబ్దుల్ కలాం జీవిత చరిత్ర మీద వచ్చిన రచనల ఆధారంగా తెరకెక్కించడమే కాకుండా ఇతర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుని తెరకెక్కిస్తామని తెలిపారు. అంతేకాకుండా కలాంపై పుస్తకం రాసిన రాజ్ చెంగప్పను ఇప్పటికే స్టోరీ విషయంలో సంప్రదింపులు కూడా జరిపామని అన్నారు.

     వచ్చే ఏడాది మార్చిలో:

    వచ్చే ఏడాది మార్చిలో:


    అలాగే ఒక పేద కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతి వరకు కలాం జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని.. బాల్యంలో అబ్దుల్ కలాం అనుభవించిన కష్టాలను, శాస్త్రవేత్తగా సాధించిన విజయాలను సినిమాలో చూపిస్తామని అనిల్ సుంకర పేర్కొన్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం త్వరలో వెల్లడిస్తామని చెప్పి.. కలాం గా ఎవరు నటిస్తారు? ఈ గొప్ప చరిత్ర కలిగిన చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయాలను నిర్మాత సప్సెన్స్ లో ఉంచేశారు.

     ఇంగ్లీష్ లో తెరకెక్కించి:

    ఇంగ్లీష్ లో తెరకెక్కించి:


    ఇక తాజా ఇన్నర్ టాక్ ప్రకారమైతే, ఈ సినిమాను ఇంగ్లీష్ లో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండటంతో.. దర్శకత్వ బాధ్యతలను టాలీవుడ్ కు చెందిన వ్యక్తికి కాకుండా జాతీయ స్థాయిలో పేరున్న దర్శకుడికి అప్పగిస్తారని తెలుస్తోంది. మరి ఈ అద్భుత ప్రాజెక్టు ఏ రేంజ్ లో పట్టాలెక్కుతుందో చూడాలి.

     ఆలోచన కొత్తదేం కాదు:

    ఆలోచన కొత్తదేం కాదు:


    అయితే అబ్దుల్ కలాం పై సినిమా అనే ఆలోచన కొత్తదేం కాదు బాలివుద్ లోనూ ఇదే తరహా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గతం లోనూ ఇదే తరహా వార్తతో వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ప్రమోత్ అనే మరాఠీ దర్శకుడు ఏపీజే అనే సినిమా ని నిర్మించటానికి ప్రయత్నాలు చె4అసాదు దాదాపు సెట్స్ మెదకి వెళ్ళేదాక వచ్చిన ఆ సినిమా మళ్ళీ వార్థల్లో ఎక్కడా కనిపించలేదు. అయితే ఇదొక్కటే కాదు బాలీవుడ్ లోనే ఈ సినిమా గురించిన ప్రయత్నం ఇంకోటికూడా జర్తిగింద్.

     ఘనమైన నివాళిని :

    ఘనమైన నివాళిని :


    ఐ యామ్ కలామ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన నిలా మధాబ్ పాండా మాజీ రాష్ట్రపతి పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు మరో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేశాడు. అబ్దుల్ కలామ్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చిన పండా.. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడం ద్వారా మిసైల్ మ్యాన్ కు ఘనమైన నివాళిని అర్పించాలని భావిస్తున్నాడు.

     ఆయన కలలను సాకారం చేయాలని:

    ఆయన కలలను సాకారం చేయాలని:


    కలామ్ సందేశాన్ని యువతకు చేరవేయడం ద్వారా ఆయన కలలను సాకారం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టింగ్ పనుల్లో నిమగ్నమైన పండా... బాలీవుడ్ మెగాస్టార్ ను కలామ్ పాత్రకు ఫైనలైజ్ చేయబోతున్నాడట.... అబ్దుల్ కలాం పాత్రకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రమే న్యాయం చేయగలడని బల్లగుద్ది చెబుతున్న దర్శకుడు మధాబ్ పండా.

     బిగ్ బీకి మాత్రమే :

    బిగ్ బీకి మాత్రమే :


    ఆయన్ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నాడు. తెరపై అంతటి మహానుభావుడి పాత్రను పోషించగల సత్తా ఒక్క బిగ్ బీకి మాత్రమే ఉందని గట్టిగా నమ్ముతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. కష్టపడి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కలామ్..

     యువతను ఆకర్షించేలా :

    యువతను ఆకర్షించేలా :


    చనిపోయే వరకూ అతిసాధారణంగానే బతికారంటున్న పండా.. ఆయన కథను తెరకెక్కించడం ద్వారా యువతను శాస్త్ర పరిశోధనల రంగంవైపు ఆకర్షించేలా చేయాలని భావిస్తున్నాడు. మరి కలామ్ గా కనిపించేందుకు అమితాబ్ ముందుకు వస్తాడో లేదో, ముదుగా టాలీవుడ్ సినిమా వస్తుందా లేక ఈ బాలివుడ్ కలాం వస్తుందా అన్న్నది చూడాలి.

    English summary
    Telugu producer Anil Sunkara and friend Abhishek Agarwal have decided to support a film about Dr.APJ Abdul kalam's life. The shooting will start from March next year and the team is busy with the pre-production work right now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X