» 

‘డబుల్ బొనాంజా’ స్పెషల్ గా పుట్టిన రోజు జరుపుకుంటున్న మంచు విష్ణు

Posted by:
 

డిసెంబర్ 2 ఎప్పుడొస్తుందా... అని యువ కథానాయకుడు మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో రోజులు లెక్కపెడుతూ ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే, ఆ రోజు తన జీవితంలో మధురమైన రోజు కానుంది. ఆ రోజు తను ఇద్దరు పిల్లలకు తండ్రి కాబోతున్నాడు! విష్ణు భార్య వేరోనికా కవల పిల్లలకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. డాక్టర్లు డిసెంబర్ 2 డేట్ ఇచ్చారు. వేరోనికా యూఎస్ సిటిజన్ కావడంతో డెలివరీ అక్కడ చేసుకుంటున్నారు. ఆ మధుర క్షణాల కోసం మోహన్ బాబు కుటుంబసభ్యులంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అన్నట్టు ఈ రోజు (నవంబర్ 23) విష్ణు పుట్టిన రోజు! ఈ వేడుకను అక్కడే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుపుకుంటున్నాడు. ఈ జన్మదినం తనకు ప్రత్యేకమైనదనీ, ఒకేసారి ఇద్దరు పిల్లలకు తండ్రిని అవుతున్నందుకు ఆనందంగా ఉందనీ విష్ణు చెబుతున్నాడు.

డిసెంబర్లో ఇండియాకు వస్తాననీ, జనవరిలో నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో రూపొందే సినిమా షూటింగులో పాల్గొంటాననీ అంటున్నాడు. విష్ణు ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమధ్య వచ్చిన 'డీ' సినిమా తర్వాత మళ్లీ అతనికి సక్సెస్ లేదు. తన స్వంత బ్యానర్ లో వస్తాడు నా రాజు సినిమా బాక్సాఫీ వద్ద అంత మంచి ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో ఓ వినోదాత్మక కథను తన తదుపరి చిత్రానికి ఎంచుకున్నాడు. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. మరో పక్క డిసెంబర్లో షూటింగు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో త్వరలో ఒకేసారి ఇద్దరి పిల్లలకు తండ్రి కాబోతున్న సుభ సందర్భంగా విష్ణుకి దట్స్ తెలుగు.కాం తరపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.

Read more about: vishnuvardhan babu, mohan babu, manchu lakshmi prasanna, dhee, మంచు విష్ణువర్థన్, మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న, డీ
English summary
Manchu Vishnu is celebrating his 32nd Birthday today in USA along with his family members. This year will be special for Vishnu as he is going to become father. Though Vishnu proved his mettle with Dhee, he could score a hit after the film.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos